భారీగా పెరిగిన ఓలా స్కూటర్ల ధరలు.. ఇప్పుడు ఎంత అంటే..

ఎలక్ట్రిక్ స్కూటర్లను( Electric scooters ) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా, ముఖ్యంగా ఓలా స్కూటర్( Ola scooter ) సొంతం చేసుకోవాలనుకుంటున్నారా, అయితే మీకు ఒక షాక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తన స్కూటర్ల ధరలను రూ.15,000 వరకు పెంచింది.ఇప్పుడు, S1 స్కూటర్ రూ.1.30 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.S1 ప్రో కోసం రూ.1.40 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

 The Prices Of Ola Scooters Have Increased Drastically How Much Is It Now , Ola E-TeluguStop.com

ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని తగ్గించడం వల్లే ఇది జరిగింది.యూనిట్ ఎనర్జీకి గతంలో రూ.15వేలు సబ్సిడీ ఉండగా ఇప్పుడు రూ.10వేలు ఇస్తున్నారు.వాహనం ధరలో 40% నుంచి 15% వరకు సబ్సిడీ గరిష్ఠ మొత్తాన్ని కూడా తగ్గించారు.దీని కారణంగా, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, టీవీఎస్, హీరో మోటోకార్ప్( Motocorp ) వంటి ఇతర కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాల ధరలను పెంచే అవకాశం ఉంది.

ఓలా S1 ప్రో స్కూటర్‌లో( Ola S1 Pro scooter ) 135 కి.మీ రైడింగ్ రేంజ్ అందించగల బ్యాటరీ ఉంది.S1 121 కి.మీ రేంజ్ ఆఫర్ చేస్తుంది.రెండు స్కూటర్ల గంటకు గరిష్టంగా 90 కి.మీ.

ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో మోడల్ 3.97 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.ఇది 58 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.మరోవైపు, S1 మోడల్ 2.98 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.ఇది గరిష్టంగా 58 Nm టార్క్‌ను అందిస్తుంది.

ఫీచర్ల పరంగా కూడా ఈ బైక్స్ అన్నిటికంటే ముందంజలో ఉన్నాయి.కాకపోతే ఇవి అంత దృఢంగా లేకపోవడం పలు విమర్శలకు దారి తీసింది.

అగ్ని ప్రమాదాలు కూడా ఈ కంపెనీ పై నెగిటివ్ ప్రభావాన్ని చూపించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube