పార్టీలో సీనియారిటీ నే తప్ప ప్రజల్లో అంతగా ప్రభావం చూపలేని సీనియర్ నాయకులతో కిక్కిరిసిపోతున్న తెలంగాణ కాంగ్రెస్ లో( Telangana Congress ) ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ అధిష్టానం . వచ్చే ఎన్నికలలో సాధ్యమైనంత యువరక్తాన్ని పార్టీలోకి తీసుకురావాలని భావిస్తుంది.
సీనియర్లు అన్న టాగ్ తో పార్టీ పదవుల కోసం కొట్టుకోవడమే తప్ప ప్రజల్లో పార్టీని నిలబెట్టే చర్యలు సీనియర్ల నుంచి రావడంలేదని ,అంతేగాక తమ వర్గ పోరుతో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి నష్టం కూడా చేస్తున్నారన్న నివేదికలు అందడంతోనే కాంగ్రెస్ అధిష్టానం ఈ మార్పులకు తెరతీసినట్లుగా తెలుస్తుంది.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకమైనవని, బారాసా ని( BRS ) ఓడించి ఎట్టి పరిస్థితుల్లోనూ అదికారం లోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నాయకత్వంలో దూకుడుగా ముందుకు వెళుతుంది .

పార్టీని అంటిపెట్టుకొని ఉండటమే తప్ప ప్రజల్లో పెద్దగా ప్రాముఖ్యత ,గుర్తింపు లేని నాయకులను పక్కన పెట్టాలని వారికి నచ్చ చెప్పొ లేక పక్కన పెట్టొ రాజకీయాలపై ఆసక్తి ఉన్న నూతన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అన్వేషిస్తున్నట్లుగా తెలుస్తుంది.గత ఎన్నికలలో చాలా చోట్ల సీనియర్లు ఓడిపోవడమే కాక ఓట్ల తేడా కూడా 50 వేల వరకూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో తగిన మార్పులు చేసుకొని యువ నాయకులను ప్రోత్సహించకపోతే పార్టీ పరిస్థితి కష్టమేనన్న సర్వేల ఆధారంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది.ఇప్పటికే ఈ దిశగా సీనియర్లకు వర్తమానం కూడా పంపించారని, పార్టీ గెలిచిన తర్వాత తగిన ప్రాధాన్యమిస్తాం తప్ప ఎన్నికలలో టికెట్ల కోసం పోటీ పడవద్దని,

అలానే వర్గ పోరు ఉన్న చోట కూడా ఎవరికి టికెట్ ఇస్తారు అన్నది సూచనప్రాయంగా చెప్పి వారి మధ్య సయోధ్య కలిగించే వాతావరణంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సన్నిహితుడైన మల్లు రవి లాంటి వారికి కూడా టికెట్లు ఇవ్వరని వార్తలు వస్తున్నాయి.పార్టీలో సీనియర్లైన వి హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య వంటి వారికి ప్రజల్లో సరైన ఆదరణ లేదని అయినా దీర్ఘకాలంగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న వారిని పక్కకు పెడితే ఎలాంటి పరిణామాలు వస్తాయో అన్న ఆందోళన కూడా అధిష్టానం లో ఉన్నట్లుగా తెలుస్తుంది .మరి వాస్తవంలో ఈ మార్పులు ఏ మేరకు ప్రయోజనం కలిగిస్తాయో చూడాలి….







