బాబోయ్ ఒక్క విస్కీ బాటిల్ ధర అన్ని కోట్లా..?

మందు బాబులం.మేము మందు బాంబులం.

 The Price Of A Bottle Of Whiskey Is All Crores , Whiskey Bottle, Too Cost, Unif-TeluguStop.com

అంటూ చాలామంది మద్యానికి బానిస అయినవాళ్లను మనం చూసే ఉంటాము.ఎందుకంటే మందు తాగితే వచ్చే కిక్కే వేరు కదా.ఆ కిక్కు కోసం ఎంతటి సాహసం అయినా చేయొచ్చు అనడానికి ఈ విస్కీ బాటిల్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.ఎందుకంటే ఒక విస్కీ బాటిల్ ధర మహా అయితే ఇంత ఉంటుంది ఐదు వేలు లేదంటే ఇరవై వేలు కదా.కానీ ఈ విస్కీ బాటిల్ మాత్రం ఏకంగా నాలుగు కోట్లకు అమ్ముడయి పోయింది.ఏంటి షాక్ అయ్యారా కానీ ఇది వాస్తవం.

నిజానికి విస్కీ, వైన్ ఎంత నిల్వ ఉంటే అంత డిమాండ్ ఉంటుంది అనే విషయం మన అందరికి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ పురాతన విస్కీ బాటిల్ ధర కళ్ళు చెదిరే ధరకు అమ్ముడయి రికార్డ్ సృష్టించింది.

ఈ లిక్కర్ బాటిల్ ను జపాన్‌కి చెందిన లిక్కర్‌ సంస్థ తయారు చేసినది.

అసలు వివరాల్లోకి వెళితే.టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టు లోని యునిఫ్రీ డ్యూటీ ఫ్రీ లిక్కర్‌ అనే ఒక షాపులో జపాన్‌కి చెందిన లిక్కర్‌ తయారీ సంస్థ అయిన సుంటోరీ తయారు చేసిన ఒక పురాతనమైన అంటే 55 ఏళ్ల నాటి ది యమజాకీ అనే ఓల్డ్‌ విస్కీకి వేలం పాట నిర్వహించారు.ఎంతో పురాతనమైన విస్కీ బాటిల్ అవ్వడంతో ఎనిమిది మంది ఈ బాటిల్ ను దక్కించుకోవానికి పోటా పోటీగా వేలం పోటీలో పాల్గొన్నారు.చివరకు చైనాకు చెందిన ఒక ప్రయాణికుడు ఈ బాటిల్ ను 4,88,000 పౌండ్లుకు అంటే 4.14 కోట్లకు సొంతం చేసుకున్నాడు.

Telugu Dutyceo, Cost, Unifreeduty, Latest, Whiskey Bottle-Latest News - Telugu

ఈ విస్కీ బాటిల్ ధర ఎక్కువ రేటుకు అమ్ముడుపోవటంపై డ్యూటీ ఫ్రీ సీఈవో అలీ హేన్ హర్ హర్షం వ్యక్తం చేశారు.ఇప్పటిదాకా మా స్టోర్‌ లో ఇంత సేల్ జరగడం రికార్డ్ బ్రేకింగ్ అని చెప్పుకొచ్చారు.అసలు ఆ బాటిల్ కు అంత ధర ఎందుకంటే సుంటోరీ వ్యవస్థాపకుడు షింజిరో టోర్రి 1960 వ సంవత్సరంలో మూడు అరుదైన రకాలకు చెందిన సింగిల్‌ మాల్ట్‌ విస్కీలను కలిపి ఈ అరుదైన యమజాకీ విస్కిని తయారు చేశారని ఆ కంపెనీ చీఫ్‌ బ్లెండర్‌ షింజిరో ఫికియో తెలిపారు.సుంటోరీ సంస్థ అరుదైన రకానికి చెందిన విస్కి అందరికి అందుబాటులో ఉండదు.

కొందరు ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ విస్కీ బాటిల్స్ ను సరఫరా చేస్తూ ఉంటుంది.గతం సంవత్సరం అంటే 2020లో కేవలం వంద విస్కీ బాటిల్స్‌ను మాత్రమే మార్కెట్‌ లో రిలీజ్‌ చేసింది.

అవి కూడా రిలీజ్ అయిన కొద్ది రోజులకే హాట్ కేకుల్లాగే అమ్ముడయిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube