తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ’ కార్యక్రమం ఇవాళ్టితో ముగియనుంది.ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు అభయహస్తం దరఖాస్తులను స్వీకరిస్తుంది.
గత నెల 28న ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం ఇవాళ సాయంత్రం వరకు కొనసాగనుంది.ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
చివరి రోజు కావడంతో ఇవాళ కూడా భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తుల డేటాను ఎంట్రీ చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కాగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజలు పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది.







