రెడ్ శాండిల్ స్మగ్లర్ ని అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు

ఎర్రచందనం అక్రమ రవాణాపై చిత్తూరు జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపారు కృష్ణగిరి కుప్పం జాతీయ రహదారి పై పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో అంతర్జాతీయ స్మగ్లర్ కడప జిల్లా చంపాడు మండలం చెండ్లురు గ్రామానికి చెందిన డాన్ గుడ్డేటి రామనాధ రెడ్డి అలియాస్ వింజమురు రమానాథ్ తో సహా మరో ముగ్గురు ని అరెస్టు చేసి 50 లక్షల రూపాయల విలువచేసే 62 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని లారీ ఒక స్కార్ పియో ను సీజ్ చేసి స్మగ్లర్లను కటకటాల్లోకి పంపించారు.

 Police Arrest Red Sandal Smuggler In Chittoor, Red Sandal Smuggler, Chittoor Dia-TeluguStop.com

శనివారం చిత్తూరు పాత ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ విద్యాసాగర్ నాయుడు వివరాలను మీడియాకు వెల్లడించారు… ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎర్రచందనం అక్రమ రవాణా ను అరికట్టడంలో భాగంగా జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

కడప జిల్లా నుంచి ఎర్రచందనం ను అక్రమంగా తరలిస్తున్నట్లు శనివారం పక్కాగా అందిన సమాచారం మేరకు కుప్పం అర్బన్ సి ఐ సాధిక్ అలీ , నగిరి సిఐ రాజశేఖరెడ్డి , కుప్పం ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి తో పాటు స్పెషల్ పార్టీ టీం పథకం ప్రకారం కుప్పం క్రిష్ణగిరి జాతీయ రహదారిలో ని నడుమురు చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీలు చేయడం జరిగిందన్నారు.

Telugu Logs Red Sandal, Red Sandal-Press Releases

అనుమానాస్పదం గా వస్తున్న 12 టైర్ల లారీ, ఒక స్కార్పియో వాహనాన్ని పట్టుకొని తనిఖీ చేయగా అందులో ఎర్రచందనం బయటపడిందని వెల్లడించారు.ఇందులో కడప జిల్లాకు చెందిన మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ స్మగ్లర్ వింజమూరు రామనాధ రెడ్డి తో పాటు అతని అనుచరులు ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలతో తోపాటు వాహనాల విలువ మొత్తం 50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పేరుపొందిన అంతర్జాతీయ రచనల స్మగ్లర్లు ఇప్పటికే రాయలసీమ జిల్లాల తో పాటు నెల్లూరు జిల్లాలో కూడా మొత్తం ఇతనిపై 60 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు , కోల్కత చెందిన ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణునితో కలిసి పెద్ద ఎత్తున ఎర్రచందనం అక్రమ రవాణా చేసేవాడని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube