స్కిప్పింగ్ లేదా జంపింగ్ రోప్ వర్కవుట్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని.ఈ ఎక్సర్ సైజ్ చేస్తున్నప్పుడు ఎంత బలశాలి అయినా సరే వెంటనే అలసిపోతారు.
మైక్ టైసన్ లాంటి వ్యక్తులకు మాత్రమే ఆపకుండా స్కిప్పింగ్ చేయడం సాధ్యమవుతుంది.ఈ చాలెంజింగ్ వర్కౌట్ మామూలుగా చేయడమే చాలా కష్టం అనుకుంటే.
దానిని వేరే లెవెల్ లో చేసాడో వ్యక్తి.ఈ వ్యక్తి ఇతర వ్యక్తుల బరువు తన భుజాలపై ఉండగా స్కిప్పింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు.
ఈ అబ్బురపరిచే వర్కౌట్ స్టంట్ కి సంబంధించిన వీడియోని వైరల్ హాగ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.
వైరల్ అవుతున్న వీడియో లో ఒక సిక్కు వ్యక్తి భుజంపై ఒక యువకుడు కూర్చోవడం చూడొచ్చు.
ఆ యువకుడిపై ఒక యువతి కూర్చోవడం కూడా గమనించవచ్చు.ఇలా ఒక సిక్కు వ్యక్తి భుజాలపై ఇద్దరు మనుషులు ఎక్కారు.
అయితే భుజాలపై కూర్చున్న యువకుడు రోప్ పట్టుకొని విసరడం ప్రారంభించాడు.ఈ సమయంలో సిక్కు వ్యక్తి ఈ రోప్ పై నుంచి దూకి స్కిప్పింగ్ చేశాడు.
ఈ క్రమంలో అతను ఏ మాత్రం బ్యాలెన్స్ కోల్పోలేదు.భుజాలపై ఇద్దరు మనుషుల బరువు ఉన్నా అతడు పైకి ఎగరడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
ఈ వ్యక్తిలో మామూలు స్టామినా లేదని కితాబిస్తున్నారు.
ఇలాంటి ఫీట్ చేయడానికి అతను ఎంత ప్రాక్టీస్ చేశాడోనని కామెంట్లు పెడుతూ అతని హార్డ్ వర్క్ ను ఇంకొందరు గుర్తిస్తున్నారు.ఆ మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని ఈ వ్యక్తి మరోసారి నిరూపించాడు.ఈ వీడియోకి దాదాపు లక్ష వరకు వచ్చాయి.
ఈ అద్భుతమైన వీడియో ని మీరు కూడా వీక్షించండి.