సోషల్ మీడియాలో అంటేనే వైరల్ కంటెంట్ అడ్డాగా మారిపోయింది.ప్రపంచంలోని ఏ నలుమూలన ఏం జరిగినా వెంటనే పట్టేసుకోవడంలో సోషల్ మీడియా తర్వాతే ఎవరైనా.
ఇక రాను రాను దీనికి యూజర్ల సంఖ్య కూడా ఓ రేంజ్ పెరిగినప్పటి నుంచి ఇంకాస్త వెరైటీ వీడియోలు, న్యూస్‌లు వైరల్‌గా మారుతున్నాయి.ఇక ఈ తరహా వీడియోలతోనే చాలామంది సెలబ్రిటీలుగా కూడా మారిపోతున్నారు.
ఇక ఇప్నుడు కూడా ఓ వైరల్ న్యూస్ తెగ హల్ చల్ చేస్తోంది.అదేంటంటే ఓ వ్యక్తి ఆకలేసి హోటల్‌కి వెళ్లి ఫుడ్ కోసం ఆర్డర్ పెడతాడు.
అయితే సాధారణంగా ఏ హోటల్ కు వెల్లినా కూడా అక్కడి సర్వర్ వచ్చి మనకు ఏం కావాలో అడగడం ఆ తర్వాత పుడ్ తీసుకురావడం కామన్.కాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే న్యూస్‌లో అయితే ఓ వ్యక్తి బిల్ వెరైటీగా కట్టడం ఒక వింత అయితే ఇక ఆ రెస్టారెంట్ వారు ఇచ్చిన ఆర్డర్ అయితే మరో వింత అనే చెప్పాలి.
ఇక మన మ్యాటర్‌లోకి వెళ్తే ఓ వ్యక్తి బాగా ఆకలేసి దగ్గరలోని రెస్టారెంట్‌కు వెళ్లాడు.ఇక అక్కుడన్న సర్వర్‌ను పిలిచి ఓ సాండ్‌విచ్ ఆర్డర్ ఇస్తాడు.అయితే ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత బిల్ కట్టేదగ్గరకు వచ్చాడు.

కానీ మనోడి దగ్గర మొఇత్తం చిల్లర నాణేలే ఉండటం, నోట్లు లేకపోవడంతో తప్పేది లేక వాటినే బిల్‌గా ఇచ్చాడు.ఇక ఆ చిల్లరనే బిల్లుగా తీసుకున్న రెస్టారెంట్ వారు ఆర్డర్ ఇచ్చారు.ఇక్కడే మనోడికి ఓ షాక్ ఇచ్చారు రెస్టారెంట్ వారు.
అది ఓపెన్ చేసి చూడగాసాండ్‌విచ్ మొత్తం ముక్కలు, ముక్కలుగా చేసి ఉండటాన్ని చూసి షాక్ అయిపోతాడు.అంటే ఆ వ్యక్తి చిల్లర నాణేలను బిల్లుగా ఇచ్చాడని, ఆ రెస్టారెంట్ వారు కూడా అలాగే ఒక్కటిగా ఉండే సాండ్‌విచ్‌ను ముక్కలుగా చేసేశారన్నమాట.
దీంతో ఆ కస్టమర్ దాన్ని సోసల్ మీడియాలో పోస్టు చేయగా విపరీతంగా ట్రోల్ అవుతోంది.
.