జబర్దస్త్( Jabardast ) తో పరిచయాన్ని ఎక్కువగా పెంచుకొని బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న బ్యూటీ రీతూ చౌదరి( Ritu Choudhary ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈమె జబర్దస్త్ కంటే ముందు బుల్లితెర పై పలు సీరియల్స్ లలో, వెండితెరపై పలు సినిమాలలో నటించింది.
తన అందంతో మాత్రం బుల్లితెర ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.
మొదట్లో ఈమె టిక్ టాక్ వీడియోలు( Tik Tok Videos ) చేస్తూ వాటి ద్వారా సోషల్ మీడియా స్టార్ గా మారింది.
అలా ఆ తర్వాత వెండితెరపై అడుగు పెట్టింది.చాలా వరకు హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించింది.ఇక బుల్లితెరపై గోరింటాకు సీరియల్ లో అవకాశం రావడంతో తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.అలా జబర్దస్త్ లో కూడా అడుగు పెట్టడంతో అందులో లేడీ కమెడియన్ గా మంచి సక్సెస్ అందుకుంది.
అందులో తన అందాలతో జబర్దస్త్ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.ఎప్పుడు ఏదో ఒక గెటప్ తో బాగా హైలెట్ అయ్యేది.జబర్దస్త్ లో కూడా తన పొట్టి పొట్టి బట్టలతో బాగా సందడి చేస్తుంది.ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.
![Telugu Jabardasth, Ritu Choudhary, Ritu Hot Hot, Tik Tok, Tiupathi-Movie Telugu Jabardasth, Ritu Choudhary, Ritu Hot Hot, Tik Tok, Tiupathi-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/04/Ritu-Hot-hot-look.jpg)
ఇక తను ధరించే దుస్తులను చూస్తే మతి పోతుంది.పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా ఆకట్టుకుంటుంది.మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు అందరిలా తను కూడా బాగా అందాలను ఆరబోస్తుంది.
ఎద అందాల నుండి థైస్ అందాల వరకు బాగా రెచ్చిపోతూ ఉంటుంది.దీంతో ఆమెను బాగా ట్రోల్ కూడా చేస్తుంటారు.
![Telugu Jabardasth, Ritu Choudhary, Ritu Hot Hot, Tik Tok, Tiupathi-Movie Telugu Jabardasth, Ritu Choudhary, Ritu Hot Hot, Tik Tok, Tiupathi-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/04/Tik-Tok-Videos-Ritu-ChoudharyTik-Tok-Videos-Ritu-Choudhary.jpg)
కానీ వాటిని అసలు పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తనకు ఖాళీ సమయం దొరకటంతో తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.
వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
![Telugu Jabardasth, Ritu Choudhary, Ritu Hot Hot, Tik Tok, Tiupathi-Movie Telugu Jabardasth, Ritu Choudhary, Ritu Hot Hot, Tik Tok, Tiupathi-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/04/The-people-who-are-shouting-at-Ritu-Choudhary.jpg)
అయితే ఓ నెటిజన్.మళ్లీ తిరుపతికి ఎప్పుడు వస్తావు.మీకోసం మేము ఎదురు చూస్తున్నాము అని అడగటంతో వెంటనే రీతూ.
వెంకీ మళ్లీ పిలవాలి అంటూ సమాధానం ఇచ్చింది.దీంతో ఆమె వెంకటేశ్వర స్వామిని వెంకీ అని అనటంతో చాలామంది ఫైర్ అవుతున్నారు.
దేవుడిని ఎవరైనా అలా పిలుస్తారా అంటూ బాగా కోపం గా కామెంట్లు పెడుతున్నారు.ఇక ప్రస్తుతం ఈమె జబర్దస్త్ కు దూరంగా ఉండగా.
సోషల్ మీడియాలలో అప్పుడప్పుడు పలు బ్రాండ్ల గురించి ప్రచారం చేస్తూ ఉంది.ఖాళీ సమయం దొరుకుతే ఫోటోషూట్ లు చేయించుకుంటూ సోషల్ మీడియా ద్వారానే సమయాన్ని గడుపుతుంది.