అభిమానం అంటే ఇది కదా... అలియా సినిమా కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన పాకిస్తాన్ నటుడు!

సాధారణంగా నటీనటుల పై ఉన్న అభిమానంతో వారి అభిమానులు వారిపట్ల ఉన్న అభిమానాన్ని వివిధ పద్ధతులలో తెలియజేస్తుంటారు.ఇక వారి అభిమాన హీరో హీరోయిన్ల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే థియేటర్ల దగ్గర అభిమానులు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 The Pakistani Actor Booked The Entire Theater For The Alia, Alia Bhatt, Bollywoo-TeluguStop.com

తాజాగా పాకిస్థాన్ కి చెందిన ఒక నటుడు బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ అభిమాని.ఈ క్రమంలోనే తాజాగా ఈమె నటించిన గంగు బాయ్ కతియవాడి.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25వ తేదీ విడుదలైంది.

మాఫీయా క్వీన్‌, ముంబయ్ లోని కామాటిపురా వేశ్య గంగూబాయ్ పాత్రలో అలియా ఒక పెద్ద ప్రయోగం చేసి మంచి విజయాన్ని అందుకుందని చెప్పాలి.

ఈ సినిమా గురించి ప్రకటించగానే ఎంతోమంది నుంచి విమర్శలు ఎదురయ్యాయి.అయితే సినిమా విడుదలైన తర్వాత విమర్శలు చేసిన వారు సైతం ప్రశంసలు కురిపించారు.

ఈ సినిమాలో అలియా వైవిధ్యమైన నటనతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతో ఆశ్చర్యపరిచింది.

Telugu Alia Bhatt, Bollywood, Pakistani, Theater-Movie

ఇదిలా ఉండగా పాకిస్థాన్ కి చెందిన నటుడు, మోడల్, ఆలియాభట్ అభిమాని మునీబ్ బట్‌ తనపై ఉన్న అభిమానంతో తాను నటించిన గంగు భాయ్ సినిమాను తన భార్యతో కలిసి చూడటానికి థియేటర్ మొత్తం బుక్ చేశాడు.ఇక ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.దీంతో ఈ పోస్ట్ చూసిన ఎంతో మంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube