డబ్బుని దొంగిలించేవారిని చూసుంటారు, నగలను దొంగిలించేవారిని చూసుంటారు, పశువులను దొంగిలించేవారిని చూసుంటారు, పిల్లలను దొంగిలించేవారిని చూసుంటారు, టీవీలను దొంగిలించేవారిని చూసుంటారు… కానీ బ్రెడ్డులను దొంగతనం చేసేవారిని ఎపుడైనా చూసారా? మీరు వింటున్నది నిజమే.ఆ ఆడవాళ్లు కేవలం బ్రెడ్డులకోసం పాష్ గా తయారై కిరాణా దుకాణాలను టార్గెట్ చేస్తారు.
ఆపై షాప్ ఓనర్ ని ఏమార్చి క్షణాల్లో అక్కడ వున్న రొట్టెలను తమ బ్యాగులలో వేసేసుకుంటారు.
వివరాల్లోకి వెళితే, బిహార్ ముంగేర్ పట్టణంలోని ఓ కిరాణ దుణానికి ఓ ఇద్దరు ఆడవాళ్లు టిప్ టాప్ గా తయారై వచ్చారు.
షాపు యజమాని వేరే కస్టమర్లతో బిజీగా ఉండటం గమనించారు.ఇద్దరు మహిళల్లో ఒకరు షాపు ఓనర్‌ని ఏదో కావాలన్నట్లుగా అడిగి అతగాడిని ఏమార్చారు.మరొకరు కిరాణషాపు కౌంటర్‌పై పెట్టిన బ్రెడ్ ప్యాకెట్‌ని సైలెంట్ గా కింద వున్న బ్యాగులో పడేసారు.అయితే ఈ తంతుని షాపు యజమాని గమనించలేదు.
కానీ షాపులో అమర్చిన సీసీ కెమెరాలో మాత్రం ఖతర్నాక్ లేడీస్ చోరీ చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.బ్రెడ్ ప్యాకెట్లతో పాటు మిక్స్చర్ ప్యాకెట్లను వాళ్లు తెచ్చుకున్న సంచిలో వేసుకొని అక్కడినుండి మెల్లిగా జారుకున్నారు.

షాపు ఓనర్ పిట్టూ చౌదరి లేడీ ఆ ఖిలాడీలు వెళ్లిపోయిన తర్వాత షాపులో పని చేసేవాళ్లను వారు ఏం కొనుగోలు చేశారని అడగడంతో, ఏం కొనుగోలు చేయలేదని తెలుసుకున్నాడు.దాంతో అతనికి అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేసాడు.దాంతో వారి తంతు బయటపడింది.వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.
మహిళల ముఖాలు స్పష్టంగా కనిపించడంతో వాళ్లను పట్టుకునే పనిలో పడ్డారు షాపు యజమాని, పోలీసులు.ఆడవాళ్లు దొంగతనాలు చేశారంటే నగలో, డబ్బో ఎత్తుకెళ్లారు గాని, విరేంటి వెరైటీగా పాతిక రూపాయలు విలువ చేసే బ్రెడ్ ప్యాకెట్‌ని దొంగిలించడానికి ఇంత కష్టపడ్డారు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







