నజ్రియా, అంజనాతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన నాని.. వీడియో వైరల్!

నేచురల్ స్టార్ నాని ప్రెసెంట్ నటించిన సినిమా అంటే సుందరానికి. ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 Nani Wife Anjana Nazriya Rocked With Dance Steps Details,ante Sundaraniki, Nani,-TeluguStop.com

శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్ లో మరొక మైలు రాయిలాగా నిలిచి పోయింది.ఈ సినిమా హిట్ తో నాని ఫుల్ ఖుషీగా ఉన్నాడు.

అదే సంతోషంలో ఈయన అంటే సుందరానికి పూర్తి చేసి విడుదల చేయడానికి సిద్ధం అయ్యాడు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న అంటే రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

రిలీజ్ దగ్గర పడుతుండడంతో గత వారం రోజులుగా ఈ సినిమా ప్రొమోషన్స్ ను గ్యాప్ లేకుండా చేస్తున్నారు.ఈ ప్రొమోషన్స్ తో ఈ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేయడంతో టీమ్ అంతా సఫలం అయ్యిందనే చెప్పాలి.

ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రొమోషన్స్ లో హీరోయిన్ కూడా తనవంతు సహాయం చేస్తుంది.

ఈ సినిమాలో నాని కి జోడీగా నజ్రియా ఫహద్ నటించిన విషయం తెలిసిందే.ఈమె తాజాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ వీడియోలో నాని భార్య అంజన తో పాటు నజ్రియా డ్యాన్స్ చేస్తున్నారు.వీరు డ్యాన్స్ చేస్తుండగా నాని మధ్యలో వచ్చి వారితో డ్యాన్స్ స్టెప్పులు వేసాడు.

ఇరువురి భామల మధ్యలో నాని వారితో వేసిన స్టెప్పులు ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటున్నాయి.నాని భార్య అంజనా కూడా డ్యాన్స్ లో అదరగొట్టింది.నజ్రియా తో పోటీగా ఈమె డ్యాన్స్ చేసి మెప్పించింది.ఈ వీడియోను నెట్టింట షేర్ చేస్తూ అంజన, నాని తో కలిసి డ్యాన్స్ చేయడం ఆనందంగా ఉంది అంటూ నజ్రియా తెలిపారు.

ఈ సూపర్ వీడియో మీరు కూడా చేసేయండి.ఇక నాని నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా వివేక్ సాగర్ సంగీతం అందించారు.తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube