మనుషుల మధ్య పంచాయతీ గురించి మీరు వినే ఉంటారు కానీ పిల్లి పంచాయతీ గురించి విన్నారా… వినలేదు కదా… వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం.ఒక పెంపుడు పిల్లి నిత్యం వీధిలో అటూ ఇటూ తిరుగుతూ ఇరుగు పొరుగు వారిని డిస్టర్బ్ చేస్తుందని, ఆ పిల్లి వలన చుట్టూ పక్కల ప్రజలు పెంచుకునే పెంపుడు జంతువులు బెదిరిపోతున్నాయంటూ ఆ వీధిలో ఉండే కొందరు ఆ పెంపుడు పిల్లిపై ఫిర్యాదు చేశారు.
ఆ పిల్లిని పెంచుకున్న పాపానికి, పాపం ఆ పిల్లి యజమానురాలుకు అధికారులు ఏకంగా 23 లక్షల రూపాయిలు జరిమానా విధించారు.అయితే ఈ గొడవను అక్కడితో వదిలేయలేదు ఆ పిల్లి యజమానురాలు.
దాదాపు 3 సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగి తాను పెంచుకుంటున్న పిల్లి ఏ తప్పు చేయలేదని కోర్టులో నిరూపించుకున్నది.
అంతేనా ఈ గొడవకు సెటిల్‌మెంట్ రూపంలో రూ.95 లక్షలు తిరిగి పొందింది ఆ పిల్లి యజమాని.అసలు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది… ఏంటి అనే వివరాలు తెలియాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే.
అమెరికాకు చెందిన అన్నా డేనియల్ అనే మహిళ పెంచుకుంటున్న పిల్లి పేరు మిస్కా. ఈ పిల్లి వీధుల వెంట తిరుగుతూ,ఇతర జంతువులను కూడా ఇబ్బంది పెడుతుందని 2019లో ఇరుగుపొరుగు వాళ్లు మిస్కా పిల్లిపై కేసు నమోదు చేశారు.
ఆపై అధికారులు ఆ పిల్లిని కొన్ని రోజుల పాటు ‘కిట్టి జైలు’లో ఉంచారు.

అలాగే ఆ పిల్లి యజమానురాలు అన్నా డేనియల్ కు జరిమానా కూడా వేశారు.ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అన్నా డేనియల్ మూడేళ్లు పాటు కోర్టులో పోరాడారు.ఆమె ఆ పిల్లి తరఫున వాదించడం కోసం ఓ న్యాయవాదిని సంప్రదించారు.
ఆయన ఆ పిల్లి పై చేసిన ఆరోపణలకు ఏ విధమైన ఆధారాలు లేవు అని,అది నమ్మశక్యంగా లేదు’ అని వాదించారు.దీంతో ఆ పిల్లి తప్పేమీ లేదని కోర్టు తీర్పునిచ్చింది.
ఎట్టకేలకు తన పిల్లి ఏ తప్పు చేయలేదని, తన పిల్లి వలన పొరుగు వారికి ఎటువంటి సమస్య కలగలేదని నిరూపించుకున్నది అన్నా డేనియల్.అంతేకాకుండా పిల్లి యజమాని అన్నా డేనియల్‌కు సెటిల్ మెంట్ రూపంలో రూ.95లక్షలు ఇవ్వాలని తీర్పునిచ్చింది కోర్టు.