తిరుమలలో కొనసాగుతున్న ‘ఆపరేషన్ చిరుత’..!!

తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది.టీటీడీ మరియు అటవీశాఖ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నారు.

 The Ongoing 'operation Cheetah' In Tirumala..!!-TeluguStop.com

ఇందులో భాగంగా వంద మంది సిబ్బంది ఆపరేషన్ చిరుతలో పాల్గొనగా మరో వందమంది సిబ్బంది వీరికి సహకరిస్తున్నారని తెలుస్తోంది.చిరుతలను బంధించేందుకు శేషాచలం అడవుల్లో అధికారులు ఇప్పటికే మూడు బోన్లను ఏర్పాటు చేశారు.

అదేవిధంగా మరో ఆరు బోన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.తిరుమల నడక మార్గంలో ఇంకా నాలుగైదు చిరుతలు సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.కాగా ఇటీవల చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతిచెందడంతో అప్రమత్తమైన అధికారులు భక్తుల భద్రత కోసం చర్యలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఇప్పటికే మూడు చిరుతలను బంధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube