తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Rowdy Hero Vijay Deverakonda ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా విజయ్ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
విజయ్ గత సినిమా లైగర్ ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసిన విషయం తెలిసిందే.ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరియర్ పై మాత్రమే కాకుండా దర్శకుడు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల కెరియర్లపై కూడా గట్టిగానే దెబ్బ కొట్టింది.
ఈ సినిమా విడుదల తర్వాత విజయ్ దేవరకొండపై దర్శకుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్( Trolls on Social Media ) నెగిటివ్ కామెంట్స్ రేంజ్ లో వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దాంతో దెబ్బకు కొంతకాలం పాటు సోషల్ మీడియాకు పూర్తి దూరంగా ఉన్నారు.అంతేకాకుండా ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఎక్కడ కూడా ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ గానీ పూరి జగన్నాథ్( Puri Jagannath ) కానీ స్పందించలేదు.అయితే లైగర్ మిగిల్చిన చేదు అనుభవాన్ని విజయ్ ఎప్పుడూ బయటకు వ్యక్తం చేయలేదు.
కానీ ఖుషి మ్యూజికల్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆ సినిమా ఎంతటి నిరాశకు గురిచేసిందనే విషయం స్పష్టమైంది.విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ఖుషి( Kushi ).
ఇందులో సమంత హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు పాటలకు ప్రేక్షకులు నుంచి భారీగా స్పందన లభించింది.అంతేకాకుండా ఇవి సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ఈవెంట్( Kushi Musical Event ) ను నిర్వహించారు మూవీ మేకర్స్.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.ఖుషి సినిమా షూట్ జరుగుతున్న సమయంలో సమంత( Samantha ) అనారోగ్యానికి గురైంది.అయితే తాను ఆమె త్వరలోనే కోలుకుంటుందని అనుకొన్నాం.
కానీ తీవ్రత ఎక్కువ కావడంతో షూటింగ్ ఆపివేశాము.ఆ సమయంలో నేను మరో సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లిపోయాను అంటూ విజయ్ తెలిపారు.ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ నోటి వెంట లైగర్( Liger ) ప్రస్తావన రాకపోవడంతో ఆయనకు ఆ సినిమా ఎంత అయిష్టంగా ఉందనే విషయం స్పష్టమైంది అంటూ సోషల్ మీడియాలోను, మీడియాలోను చర్చ జరుగుతోంది.
అలా విజయ్ దేవరకొండ, లైగర్ మూవీ పేరు కానీ, కనీసం దర్శకుడు పూరి జగన్నాథ్ పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు విజయ్.