మహిళా రోగి జుట్టు పట్టుకుని తోసేసిన నర్సు.. షాకింగ్ వీడియో వైరల్!

ఈ రోజుల్లో పెరిగిపోతున్న డాక్టర్ల నిర్లక్ష్యం, దురుసు ప్రవర్తనతో పేషెంట్లు హడలిపోతున్నారు.ఎందుకంటే ఈ కాలంలో కొన్ని ఆసుపత్రులకు వెళ్లిన పేషెంట్లు కొత్త సమస్యలతో తిరిగి బయటకు వస్తున్నారు.

 The Nurse Who Grabbed The Female Patient's Hair And Pushed Her The Shocking Vide-TeluguStop.com

కొందరు డాక్టర్లు విచక్షణారహితంగా పేషంట్లపై దాడులు కూడా చేస్తున్నారు.కాగా తాజాగా ఒక మహిళ నర్సు ఒక మహిళ పేషంట్‌పై దాడి చేసింది.

ఈ నర్సు పేషెంట్ జుట్టు పట్టుకొని బెడ్‌పై బలంగా తోసింది.ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ దారుణం వెలుగు చూసింది.

సీతాపూర్ జిల్లా ఆసుపత్రిలో అక్టోబర్ 18న ఈ ఘటన జరగగా.దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.అక్టోబర్ 18న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళా రోగిని జనరల్ వార్డులో కుటుంబ సభ్యులు అడ్మిట్‌ చేశారు.అనంతరం వారు బయటకు వెళ్లగా కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆ మహిళ పట్ల నర్సులు దారుణంగా బిహేవ్ చేశారు.ఒక నర్సైతే ఏకంగా ఆ అభాగ్యురాలి జుట్టు పట్టుకుని బెడ్‌పైకి తోసింది.

ఆసుపత్రికి వచ్చిన వారిని కాపాడాల్సిన వీరే ఇలాంటి దాడులకు పాల్పడమేంటి అని చాలామంది నర్సును తిట్టిపోస్తున్నారు.ఇలాంటి తల పొగరు ఉన్న నర్సులను వెంటనే జాబ్ నుంచి తొలగించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు.

కాగా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్ ఆర్కే సింగ్ నర్సును సమర్ధించడం గమనార్హం.ఆయన ప్రకారం అర్ధరాత్రి వేళ ఆ మహిళా రోగి వింతగా ప్రవర్తించిందట.అయితే ఆమెను కంట్రోల్ చేయడానికి ఇలా జుట్టు పట్టుకుని నర్సు తోసిందట.నిజానికి పిచ్చివాళ్లను కంట్రోల్ చేయాలన్నా డాక్టర్లు చాలా జాగ్రత్తగా వారిని పట్టుకుని ఒక దగ్గర ఉంచుతారు.

ఇలా ఎన్నడూ ప్రవర్తించరు.కానీ నర్స్ మాత్రం చాలా బ్యాడ్‌గా ఆ మహిళను ట్రీట్ చేసింది.

మహిళ ఇంజక్షన్‌ ఇచ్చిన తర్వాత సాధారణ పరిస్థితికి వచ్చినట్లు సమాచారం ఆపై ఆమెను డిశ్చార్జ్ చేశారట.ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube