వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై సేవ్‌కాని నంబర్లకు మెసేజెస్ పంపండిలా..!

200 కోట్ల యూజర్లతో ప్రపంచంలోనే నంబర్వన్ మెసేజింగ్ అప్లికేషన్ గా పేరొందిన వాట్సాప్ గురించి తెలియని వారంటూ ఉండరు.

ఇది యూజర్లను ఆకట్టుకునేందుకు తరచుగా కొత్త ఫీచర్లతో ముందుకు వస్తోంది.

తాజాగా వాట్సాప్‌లో సేవ్‌కాని నంబర్లకు సైతం మెసేజ్ చేసేలా ఓ కొత్త ఫీచ‌ర్ తీసుకొచ్చింది.ఇప్పటివరకూ వాట్సాప్‌లో ఎవరికైన మెసేజ్ చేయాలంటే వారి నంబర్ మన కాంటాక్ట్ లో కచ్చితంగా సేవ్ చేసుకోవాల్సి వచ్చేది.

ఇది సమయంతో కూడుకున్న పనే కాదు మన ప్రైవసీని కూడా హరించేస్తుంది.ఈ విషయాన్ని గుర్తించిన వాట్సాప్.

తమ యూజర్ల శ్రేయస్సు కోసం కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది.ఈ ఫీచర్ ఉపయోగించి మన కాంటాక్ట్ లిస్టులో సేవ్ కాని నంబర్లకు సైతం మెసేజ్‌లు పంపొచ్చు.ఎలాగో తెలుసుకుంటేముందుగా మీరు మీ ఫోన్‌లోని బ్రౌజ‌ర్‌ను ఓపెన్ చేసి యూఆర్‌ఎల్‌ అడ్రస్‌ బార్‌లో http://wa.me/91xxxxxxxxxx లింక్‌ని పేస్ట్ చేయాలి.తరువాత మీరు ఎవ‌రికి మెసేజ్ చేయాల‌నుకొంటున్నారో వారి నంబ‌ర్ ఎంటర్ చేయాలి.

Advertisement

ఆపై లింక్ తెర‌వ‌డానికి ఎంట‌ర్ ప్రెస్ చేయాలి.

అప్పుడు మీకు మెసేజ్ బాక్స్ ఉన్న ఓ పేజ్ ఓపెన్ అవుతంది.ఆ పేజ్ నుంచి మీరు మెసేజ్ చేయొచ్చు.ఈ ఈజీ స్టెప్స్ క్షణాల్లోనే ఫాలో అవుతూ నంబ‌ర్ సేవ్ చేయ‌కుండానే వాట్సాప్ మెసేజులు పంపించవచ్చు.

ఈ ఫీచర్ అందరికీ ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుంది.కాబట్టి వెంటనే ఒక సారి ఇది టెస్ట్ చేసి చూడండి.

ఇక త్వరలోనే వాట్సాప్ గ్రూప్ ఐకాన్ మార్చుకోవడానికి వీలుగా మరింత యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను తీసుకు రాబోతోంది.ఇప్పటికే ఇది వ్యూ వన్స్‌, మల్టీ డివైజ్‌, ఫొటో ఎడిటింగ్ వంటి పలు అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు