సినిమాల్లో ఒక హిట్ అయిన మూవీకి సిక్వల్స్ ఋపొందించడం సర్వసాధారణం.ఎందుకంటే హిట్ అయిన మూవీకి ఆల్రెడీ ఆడియన్స్ లో క్రేజ్ ఉంటుంది.
దాంతో ఆ మూవీకి సిక్వల్స్ రూపొందిస్తే ఆడియన్స్ కు త్వరగా రిచ్ అయ్యే అవకాశం ఉంటుంది.అలాగే ఆ సిక్వల్ పై స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుంది.
ఉదాహరణకు అల్లు అల్లు అర్జున్ కెరియర్ ప్రారంభంలో ఆర్య మూవీలో నటించగా దాదాపు పదేళ్ళ తరువాత ఆర్య 2 మూవీతో ఆ మూవీకి సిక్వల్ రూపొందించారు.ఇక అలాగే గాయం 2, ఐస్ క్రీమ్ 2, సింగం 2.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద సిక్వల్స్ లిస్టే కనిపిస్తోంది.అయితే సిక్వల్స్ ను రెండు విధాలుగా చెప్పుకోవచ్చు.

మొదటి భాగానికి కొనసాగింపుగా రూపొందించడం లేదా మొదటి భాగంలోని కథ పాయింట్ ను తీసుకొని కొత్త కథ రూపొందించడం.అయితే ఇదంతా ఒకప్పటి ట్రెండు.ఇప్పుడు ట్రెండు మారింది కథలు కూడా మారాయి.సిక్వల్స్ పోయి యూనివర్స్ అంటూ మూవీస్ తీస్తున్నారు మేకర్స్.అంటే ఒక మూవీలోని కథతో మరొక మూవికి జత చయడం.ఇప్పుడు ఇలాంటి కథలు రాయడానికే మేకర్స్ మొగ్గు చూపుతున్నారు.
ఇలాంటి మూవీస్ ముఖ్యంగా మార్వెల్ సిరీస్ లలో చూస్తూ ఉంటాము.ఇప్పుడు ఇదే ట్రెండు తమిళ్, తెలుగు చిత్ర దర్శకులు కొనసాగిస్తున్నారు.
లోకేశ్ కనకారాజ్( Lokesh Kanakaraj ) దర్శకత్వంలో వచ్చిన ఖైదీ మూవీ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఆ తరువాత అదే దర్శకుడు కమల్ హాసన్( Kamal Haasan ) తో విక్రమ్ మూవీని తీసి ఖైదీ మూవీకి కనెక్ట్ చేశాడు.
ఇలా ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఏడు భాగాలు ఉంటాయని కూడా లోకేశ్ గతంలోనే స్పష్టం చేశారు.

ఇక ఇదే ట్రెండు ను తెలుగు దర్శకులు కూడా కొనసాగిస్తున్నారు. శైలేశ్ కొలను( Shailesh kolanu ) దర్శకత్వం వహించిన హిట్ మూవీ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఆ మూవీకి కనెక్ట్ చేస్తూ వచ్చిన హిట్ 2( Hit 2 ) కూడా సక్సస్ అయింది.
దాంతో హిట్ సిరీస్ ను యూనివర్స్ గా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు శైలేష్ కొలను.ఇక జాంబిరెడ్డి మూవీతో విలక్షణ దర్శకుడి జాబితాలో చేరిన ప్రశాంత్ వర్మ కూడా యూనివర్స్ మూవీస్ ప్లాన్ చేస్తున్నాడు.
ఆయన దర్శకత్వంలో వస్తున్న ” హనుమాన్ “( Hanuman ) మూవీకి కొనసాగింపుగా యూనివర్స్ మూవీస్ ఉంటాయని స్పష్టం చేశారు.ఇక బాలీవుడ్ కూడా ఇదే ట్రెండు ఫాలో అవుతోంది స్పై యూనివర్స్ గా వచ్చిన వార్, పటాన్ మూవీస్ కు కనెక్ట్ చేస్తూ మరిన్ని సినిమాలు వస్తాయని యష్ రాజ్ సంస్థ ఆల్రెడీ ప్రకటించింది.
మొత్తానికి సిక్వల్స్ ట్రెండ్ పోయి.యూనివర్స్ ట్రెండ్ వచ్చిందనమాట.







