సాధారణంగా సమ్మర్ లో సినిమాల సందడి గట్టిగానే ఉంటుంది.ఎందుకంటే సమ్మర్ హాలీడేస్ ను క్యాష్ చేసుకునేందుకు పోటాపోటీగా మూవీస్ ను రిలీజ్ చేస్తుంటారు మేకర్స్.
మార్చి మొదలుకొని మే ఎండింగ్ వరకు సమ్మర్ లో వినోదాన్ని పెంచేందుకు థియేటర్స్ కు క్యూ కడుతుంటాయి చాలా సినిమాలు.ముఖ్యంగా సమ్మర్ టార్గెట్ గా బడా హీరోలు వారి మూవీస్ ను రిలీజ్ చేస్తుంటారు.
అయితే ఈ సమ్మర్ కి ఏ ఒక్క స్టార్ హీరో కూడా బరిలో లేకపోవడంతో చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు ఈ సమ్మర్ ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాయి.ఫేస్ టూ హీరోలలో మంచి క్రేజ్ ఉన్న నాని దసరా మూవీతో మంచి విజయాన్ని అందుకొని సమ్మర్ కు శుభారభం అందించారు.

ఇక ఈ నెల 7న మాస్ మహారాజ్ రవితేజ ( Ravi Teja )తన అప్ కమింగ్ మూవీ రావణాసుర( Ravanasura ) తో ఆడియన్స్ ను పలకరించనున్నారు.ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ ” రావణాసుర ” మూవీతో అదే సక్సస్ కొనసాగించాలని చూస్తున్నాడు.ఇక ఇదే రోజున యంగ్ హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) నటించిన ” మీటర్ ” మూవీ కూడా రిలీజ్ కానుంది.ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ తరువాత సరైన హిట్ లేని కిరణ్ అబ్బవరం.
ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు.ఇక మరో వారం గ్యాప్ లో ఏప్రెల్ 14 న దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పీరియాడికల్ మూవీ శాకుంతలం రిలీజ్ కానుంది.
రుద్రమదేవి తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.ఇక ఆ తరువాత సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం విరూపాక్ష ఏప్రెల్ 21న విడుదల అవుతోంది.

యాక్సిడెంట్ తరువాత సాయిధరమ్ తేజ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇక ఏప్రెల్ 28న మోస్ట్ అవైటెడ్ మూవీ ఏజెంట్ రిలీజ్ కానుంది.అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.అయితే ఇప్పటివరకు కూడా ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో ఏప్రెల్ 28న ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
ఇక డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే పోన్నియన్ సెల్వన్ పార్ట్ 2 కూడా ఏప్రెల్ 28 ననే రిలీజ్ కానుంది.దీనితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ” కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ” మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవ్వనుంది.
ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు.అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక చిన్న క్యామియో రోల్ చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఈ సమ్మర్ లో స్టార్ హీరోల మూవీస్ లేని లోటును చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు డబ్బింగ్ సినిమాలు భర్తీ చేయనున్నాయి.







