వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి ( Varun Tej,Lavanya tripathi ) ల పెళ్లి ఈరోజు అనగా నవంబర్ 1న చాలా గ్రాండ్ గా ఇటలీలో కుటుంబ సభ్యులందరి సమక్షంలో దాదాపు 120 మంది తో కలిసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నారు.ఇక ఇప్పటికే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి లకు సంబంధించిన హల్దీ ఫంక్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.
ఇక ఇందులో వరుణ్ తేజ్ లావణ్యలు పసుపురంగు దుస్తుల్లో అలాగే హల్దీ ఫంక్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు పసుపు రంగు దుస్తుల్లోనే కనిపించారు.ఇక ఈ ఫంక్షన్ లో ఎల్లో కలర్ డ్రెస్ లో చిరంజీవి ( Chiranjeevi ) పాతికేళ్ల కుర్రాడి లా కనిపించారు.
దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉంటే వీరి పెళ్లి ఈరోజు మధ్యాహ్నం 2:48 నిమిషాలకు జరుగుతుందని ఇప్పటికే వార్తలు వినిపించాయి.ఇక ఇదంతా పక్కన పెడితే ఇటలీకి వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లికి హీరో నితిన్ ఏకంగా బస్సు వేసుకొని వచ్చిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో మనం చూసాం.అలాగే వీరి పెళ్లికి సమంత, నాగచైతన్యతో పాటు రష్మిక మందన్నా( Rashmika mandanna ) , రీతూ వర్మ అలాగే ఇంకొంత మంది సెలబ్రిటీలు కూడా రాబోతున్నట్టు సమాచారం.

అయితే గత కొద్ది రోజులుగా నందమూరి ఫ్యామిలీ తోమెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది.ఈ నేపథ్యంలోనే వరుణ్ తేజ్ తన పెళ్లికి రమ్మని నందమూరి ఫ్యామిలీ లోని అందరికీ ఆహ్వానం పంపించారట.కానీ బాలకృష్ణ ( Balakrishna ) సినిమాలు, అలాగే రాజకీయం గొడవల్లో పడి పెళ్లికి రాలేకపోయారట.కానీ ఎన్టీఆర్ కి స్వయంగా ఇంటికి వెళ్లి మరీ ఆహ్వాన పత్రికను అందజేశారట వరుణ్ తేజ్.
కానీ ఎన్టీఆర్ కూడా ఈయన పెళ్లికి రావడం లేదట.దాంతో వరుణ్ తేజ్ అంటే ఎన్టీఆర్ ( NTR ) కి ఇష్టం లేదా.
అందుకే పెళ్లికి రావడం లేదా అని కొంతమంది కావాలనే ఎన్టీఆర్ పేరుని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.కానీ అసలు విషయం ఏమిటంటే.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో కలిసి దేవర సినిమా షూటింగ్లో ఉన్నారు.కాబట్టి ఆయనకు వీలుపడలేదు ఈ కారణంతోనే రావడం కుదరదు అని వరుణ్ తేజ్ కి కూడా పెళ్లి కార్డు ఇచ్చిన సమయంలోనే చెప్పారట.
కానీ ఈ విషయం తెలియని చాలామంది ఎన్టీఆర్ పేరుని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.







