వరంగల్ లో జరిగిన మెడికో ప్రీతి మరణంపై మిస్టరీ వీడలేదు.హైదరాబాద్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి వరంగల్ జిల్లా మట్టేవాడ పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందింది.
ఈ రిపోర్టును బట్టి ప్రీతిది ఆత్మహత్యానా? హత్యనా ? అన్న విషయంపై పోలీసులకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా పీఏసీ రిపోర్ట్ వివాదంలో డాక్టర్ స్మృతి అభిప్రాయం కీలకంగా మారిందని తెలుస్తోంది.
డాక్టర్ స్మృతితో పాటు మరో ముగ్గురిని పోలీసులు ప్రశ్నించారు.ఈ క్రమంలో పీఏసీ రిపోర్ట్ వివాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.
నిందితుడు సైఫ్ వేధింపులపై ఫిర్యాదు చేసిన తరువాత హెచ్ఓడీ కౌన్సిలింగ్ లో ప్రీతి కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఎల్డీడీ- నాకౌట్స్ గ్రూపులో తనను సపోర్ట్ చేయాలని మెడికోలను ప్రీతి వేడుకున్నట్లు గుర్తించారు.
మరోవైపు నిందితుడిగా ఉన్న సైఫ్ ను పోలీసులు నాలుగో రోజు విచారిస్తున్నారు.







