మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డు కార్యక్రమాలలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే లాస్ ఏంజెల్స్ లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ తాను మగధీర సినిమాలో నటిస్తున్న సమయంలో రాజమౌళి గారికి ఒక స్టూడెంట్ అని తెలిపారు.అయితే మగధీర సినిమా తర్వాత ఇన్నేళ్లు సినీ కెరియర్ లో కొనసాగుతున్న తిరిగి రాజమౌళి గారి RRR సినిమా షూటింగ్ సమయానికి తాను ఒక స్టూడెంటేనని తెలిపారు.

ఇన్నేళ్ల తన సినీ కెరియర్ లో ఏదైనా కొత్తగా నేర్చుకొని తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాను అందుకే RRR సినిమాకి ముందు కాస్త ఇండస్ట్రీకి విరామం ప్రకటించాలని అనుకున్నాను.ఆ సమయంలోనే రాజమౌళి గారి నుంచి ఈ సినిమా ఆఫర్ వచ్చిందనీ ఈ సందర్భంగా రామ్ చరణ్ తన సినీ కెరియర్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.రాజమౌళి నాకు ప్రిన్సిపల్, టీచర్, గురు అని సరదాగా చెప్పడం లేదు.ఆయన్ని కలిసిన ప్రతిసారీ నటన గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించారని దానిని మరో పదేళ్ల తన సినీ కెరియర్లో వినియోగించుకుంటానని ఈ సందర్భంగా రామ్ చరణ్ రాజమౌళి గురించి తెలియజేశారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించకు ముందు మేమిద్దరం మంచి స్నేహితులం.అయితే ఈ సినిమాలో నటించే వరకు తాము ఎక్కువ సమయం తమకోసం కేటాయించుకోలేకపోయాం కానీ ఈ సినిమా మమ్మల్ని మరింత దగ్గర చేసిందని అందుకు రాజమౌళి గారికి ధన్యవాదాలు అంటూ రామ్ చరణ్ తెలిపారు.ఈ సినిమాలో తారక్ ఉండటం వల్ల సోదర భావం చూపించడానికి తనకు చాలా సులభంగా మారిందని తెలిపారు.ఇక ప్రస్తుతం తాను ఎన్టీఆర్ ను చాలా మిస్ అవుతున్నానని కొన్ని పనుల కారణంగా తను ఇక్కడికి రాలేకపోయారని తెలిపారు.
తారక్ నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఈ సందర్భంగా రామ్ చరణ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







