ఫోన్‌లో బిజీ అయిపోయిన కోతి.. నెట్టింట వీడియో వైరల్

ప్రస్తుత ఆధునిక యుగంలో అంతా స్మార్ట్ ఫోన్‌కు బానిసలు అయిపోతున్నారు.ఇక స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండలేకపోతున్నారు.

 The Monkey Is Busy On The Phone The Video Of Pushing Has Gone Viral, Monkey, Ph-TeluguStop.com

అన్ని పనులు ఫోన్‌తోనే ముడిపడి ఉన్నాయి.ఏం కావాలన్నా స్మార్ట్ ఫోన్ తీసుకుని చకచకా ఆర్డర్ చేసేస్తున్నారు.

ఏదైనా కొనాలన్నా, ఏవైనా బిల్లులు చెల్లింపులు చేయాలన్నా స్మార్ట్ ఫోన్ ద్వారానే అన్ని పనులు పూర్తి అవుతున్నాయి.దీంతో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో విడదీయరాని ఓ భాగం అయిపోయింది.

అయితే కొందరు పరిమితికి మించి ఫోన్ వాడుతూ ఉంటారు.క్షణం తీరిక లేకుండా స్మార్ట్ ఫోన్‌‌తోనే తమ జీవితం మొత్తం గడిపేస్తున్నారు.

అయితే మనుషులే కాకుండా ఇటీవల కాలంలో జంతువులకు కూడా స్మార్ట్ ఫోన్ అలవాటు అయిపోతుంది.ఇదే కోవలో ఓ కోతి స్మార్ట్ ఫోన్ వాడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతోంది.

ట్విట్టర్‌లో లవ్ పవర్ అనే ఖాతాలో ఇటీవల ఓ వీడియో పోస్ట్ అయింది.అందులో ఓ కోతి స్మార్ట్ ఫోన్ వినియోగిస్తూ ఉంటుంది.ముఖ్యంగా ఓ చేతిలో స్మార్ట్ ఫోన్‌లో వీడియోలు చూస్తూనే, మరో చేతితో ఆహారం తింటూ కనిపిస్తుంది.ఒకే సారి రెండు పనులు చక్కగా చేసేస్తుంటుంది.

తనకు నచ్చని వీడియోలు కనిపిస్తే, స్క్రీన్ స్క్రోల్ చేస్తూ ఉంటుంది.ఇక ఆ కోతి పక్కనే ఓ మహిళ పడుకుని కనిపిస్తుంది.

అయితే ఆమెను కూడా ఆ కోతి పట్టించుకోదు.తన పనిలో తాను బిజీ అయిపోతుంది.

అంతలా ఫోన్ వాడుతూ కనిపిస్తుంది.ఈ వీడియోను ట్విట్టర్‌లో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

చివరికి కోతులకు కూడా స్మార్ట్ ఫోన్ బిజీ అలవాటు అయిపోయిందని కామెంట్లు పెడుతున్నారు.స్మార్ట్ ఫోన్‌కు మనుషులు బానిసలు అవ్వడం చూశామని, ప్రస్తుతం కోతులు కూడా బానిసలు అయిపోయాయని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube