రెడ్లరేపాక చెరువుపై కరుణించని ఆకాశగంగ

యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామ చెరువుపై ఆకాశగంగ కరుణ లేక నీటిచుక్క రాక ఎడారిని తలపిస్తూ పిచ్చిమొక్కలతో,రాళ్లూ, రప్పలతో అడవిని తలపిస్తుంది.

ఈ చెరువు గ్రామప్రజలకు,పశుపక్ష్యాదులకు,వ్యవసాయానికి జీవనాధారంగా ఉండేది.

గత వర్షాకాలంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు,వాగుకు వంకలు పొంగిపొర్లినా ఇక్కడ మాత్రం వర్షా ధార నిరసన తెలిపింది.దీనితో చెరువు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

గ్రామాల అభివృద్ధికి మూలాధారమైన చెరువు నీరు లేక వెలవెలబోవడంతో గ్రామ ప్రజలు,రైతులుకు ఇబ్బందిగా మారింది.పశువులువు,వివిధ జీవరాశులు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.

ఇప్పటికైనా స్థానిక ఎమ్మేల్యే,సంబధిత జిల్లా అధికారులు చొరవ తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చెరువును నీటితో నింపి గ్రామ ప్రజల ఆవేదనను తీర్చాలని వేడుకుంటున్నారు.

Advertisement
ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి ఒక వరం

Latest Yadadri Bhuvanagiri News