ప్రపంచంలోనే ప్రమాదకరమైన పాముని ఆస్పత్రికి తీసుకెళ్లిన వ్యక్తి.. మ్యాటరేంటంటే?

మనలో చాలామందికి పాములు అంటే విపరీతమైన భయం ఉంటుంది.ఒక్కోసారి అనుకోని ప్రదేశాలలో విషపూరితమైన పాములు దర్శనమిస్తూ ఉంటాయి.

తాజాగా అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటైన రస్సెల్స్ వైపర్ అనే పాము ఒకటి దర్శనమిచ్చింది.ఈ సంఘటన బీహార్‌( Bihar ) లోని భాగల్‌పూర్‌లో చోటుచేసుకుంది.

అయితే ఓ వ్యక్తి రస్సెల్స్ వైపర్ పాము కాటుకు గురి అయినట్లు తెలుస్తుంది.అనంతరం ఆ యువకుడు ఆ పాము నోటిని గట్టిగా పట్టుకొని హాస్పిటల్ కు వైద్యం చేయించుకోవడానికి వచ్చాడు.

ఇలా పామును చేత్తో పట్టుకొని ఆసుపత్రికి రావడంతో అక్కడ ఉన్నవారు అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.అతి కష్టం మీద ఆ పామును ఒక సంచిలో వేసి కట్టేసి అనంతరం డాక్టర్లు ఆ వ్యక్తికి వైద్య సేవలు అందించారు.

Advertisement

ఇకపోతే ఆ యువకుడు భాగల్‌పూర్‌ జిల్లాలోని బరారి పంచాయతీ మీరాచక్ ప్రాంతవాసి అని సమాచారం.అతడి పేరు ప్రకాష్ మండల్( Prakash Mandal).తాజాగా అతడు రస్సెల్స్ వైపర్ పాము కాటేయడంతో దానిని వెంటనే పట్టుకొని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని మెడిసిన్ ఎమర్జెన్సీ విభాగానికి వచ్చాడు.

ఈ క్రమంలో పాముని చేత్తో పట్టుకొని హాస్పిటల్లో అటూ ఇటూ తిరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారందరికీ ఇబ్బందులు తలెత్తాయి.ప్రకాష్ మండల్ తన కుడి చేత్తో పామును పట్టుకోగా ఎడమ చేతికి పాము కాటు వేసిందని తెలిపాడు .

అతడి దగ్గర పాము ఉండడంతో డాక్టర్లు కూడా దగ్గరికి వచ్చి వైద్యం చేయలేకపోయారు వైద్యులు.పామును తన చేతిలో నుంచి తొలగిస్తే తప్ప వైద్యం చేయమని డాక్టర్లు చెప్పడంతో.ఈ క్రమంలో బాధితుడి కుటుంబ సభ్యులు, నర్సింగ్ సిబ్బంది వారు ఎలాగోలా ఆ పామును చేత్తో తీసేసి ఒక గోనెసంచిలో పెట్టి అనంతరం ప్రకాష్ కు చికిత్స అందజేశారు.

ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలియజేశారు.అయితే, వాస్తవానికి భాగల్‌పూర్‌ ప్రాంతంలో పాములు నిరంతరం దర్శనమిస్తున్నాయని వందలాది పాములు ఇప్పటికే ఆటవీ శాఖ వారు రక్షించారని అక్కడి స్థానికులు తెలియజేశారు.

ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)
Advertisement

తాజా వార్తలు