మనం చూస్తేనే వాంటింగ్‌ చేసుకునే పురుగులతో అతడు లక్షలు సంపాదిస్తున్నాడు.. ఆడు మగాడ్రా బుజ్జి

ఎప్పుడైనా ఇంట్లోకి చిన్న మిడతలు, బొద్దింక కాని, సాలీడు కాని వస్తేనే దాన్ని పొరకతోనో లేదంటే మరి దేనితోనైనా బయటకు పంపించే వరకు వదిలి పెట్టం.

ఒకవేల అది మన ఒంటికి తాకిన, చేతికి తాకినా కూడా డెటాల్‌ వేసి మరీ కడుకుంటాం.

ఇది ఇండియాలో ప్రతి ఒక్కరు చేసే పని.కాని జపాన్‌ లో మాత్రం పూర్తి విభిన్నం.మనం చీదరించుకునే పురుగులను అక్కడ ప్రత్యేకంగా పెంచుతారు.

జపాన్‌లో పురుగులను ఎక్కువగా తింటారనే విషయం తెల్సిందే.కాని బొద్దింకలు, సాలీడు, మిడతలు ఇలా రకరకాలుగా కీటకాలను జపాన్‌లో ఇష్టంగా తింటారు.కప్పలు, పాములు వంటివి జపాన్‌లో ఎక్కువగా లభించడంతో పాటు, తక్కువ రేటు అవ్వడం వల్ల వాటిని అక్కడి జనాలు ఇష్టంగా తింటారు.

అయితే పైన చెప్పిన కీటకాలు మాత్రం తక్కువగా లభిస్తాయి.

Advertisement

దాంతో వాటిని అమ్మే వారు అత్యధిక రేటుకు అమ్ముతూ ఉంటారు.తాజాగా జపాన్‌లోని ఒక నగరంలోని రద్దీ ఏరియాలో స్నాక్స్‌ వెండింగ్ మిషన్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది.స్నాక్స్‌ వెండింగ్ మిషన్‌ అంటే మనం రైల్వే స్టేషన్స్‌ లో వాటర్‌ బాటిల్స్‌, చాక్‌ లేట్స్‌ ఇంకా ఏవైనా స్నాక్స్‌ చూస్తూ ఉంటాం.

కాని ఆ స్నాక్స్‌ వెండింగ్ మిషన్‌లో మాత్రం చిత్రంగా కీటకాలతో తయారు చేసిన స్నాక్స్‌ ఉన్నాయి.

కొత్తగా ఏర్పాటు చేసిన ఆ స్నాక్స్‌ అమ్మే వెండింగ్ మిషన్‌కు మంచి డిమాండ్‌ ఉంది.సాలీళ్లు, మిడతలు, బొద్దింకలు, పెద్ద, చిన్న పురుగులు కలిసి మొత్తం 12 రకాల స్నాక్స్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది.పురుగును బట్టి స్నాక్స్‌ రేటును నిర్ణయించారు.

మినిమంగా ఒక్కో స్నాక్స్‌ ప్యాకిట్‌ 500 రూపాయలు ఉంటుంది.అంత రేటు ఉన్నా కూడా హాట్‌ కేకుల్లా ఆ పురుగుల స్నాక్స్‌ అమ్ముడు పోతున్నాయి.కేవలం నెల రోజుల్లోనే స్నాక్స్‌ అమ్మే మిషన్‌ ద్వారా 3.5 లక్షల ఆదాయంను సదరు వ్యాపారి దక్కించుకున్నాడు.తెలివిగా ఆలోచిస్తే లక్షలు సంపాదించొచ్చు అని ఆ వ్యాపారి కూడా నిరూపించాడు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు