ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్( Smartphone ) అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో అంతర్భాగం అయింది.కొందరు ఫోన్ కేవలం అవసరాలకే ఉపయోగిస్తుంటే, మరికొందరు మాత్రం తమ పనులను పక్కనపెట్టి ఫోన్లకి అతుక్కుపోతున్నారు.
పనులు చేస్తూ కూడా మొబైల్ ఫోన్‌లో తల దూర్చుతున్నారు.ఇక వాహనాలను నడిపే వారు కూడా డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడుతున్నారు.
దీనివల్ల చాలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.కాగా ఒక లేడీ లోకోపైలట్( Lady Locopilot ) ఇటీవల ట్రైన్ నడుపుతూ మొబైల్ వాడింది.
అయితే ఆమె పట్టాలపై ఏముందో చూసుకోకుండా మరో రైలును కొట్టింది.ఈ అతిపెద్ద ప్రమాదం రష్యాలో చోటుచేసుకుంది.
దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ లేడీ లోకో పైలట్ ట్రైన్ నడుపుతూ ఉండటం చూడవచ్చు.అదే సమయంలో ఆమె ఫోన్‌లో వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంది.ముందు ఎవరైనా ఉన్నారా లేకపోతే ట్రైన్‌లు ఆగి ఉన్నాయా అనే విషయాన్ని కూడా ఆమె పట్టించుకోలేదు.
ఇంతలోనే అలా ట్రైన్ వెళుతూ ఉండగా రైల్వే పట్టాలపై మరో ట్రైన్ ఆగి ఉండటం కనిపించింది.లోకో పైలట్ మాత్రం దీనిని గమనించలేదు.దీనివల్ల ఆమె ఎలాంటి బ్రేక్ వెయ్యలేదు.ఇక రైలు దానిని ఢీకొట్టేస్తోందన్న సమయంలో ఆమె ఈ విషయాన్ని గమనించింది.
వెంటనే అప్రమత్తమయి ఎమర్జెన్సీ బ్రేకులు వేయడానికి ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నం వృధాగా మారింది.
ఆమె నడుపుతున్న ట్రైన్ ఆగి ఉన్న మరో ట్రైన్‌ని ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు.ట్రైన్ క్రష్ జరగడంతో అందులో కూర్చున్న ప్రయాణికులు ఒక్కసారిగా ముందుకు ఎగిరిపడ్డారు.
అదృష్టం కొద్దీ రైలులో సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ఉంది.దాంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్ల లేదు.
పైలట్ మొబైల్ చూస్తూ ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించిందో డ్రైవింగ్ కేబిన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ చేసిన తర్వాత ఉన్నత అధికారులకు అర్థమయింది.దాంతో షాక్ అవ్వడం వారి వంతయింది.
వందల మంది ప్రయాణికులు ఉన్న ట్రైన్ నడుపుతూ ఇంత నిర్లక్ష్యంగా ఆమె ఎలా వ్యవహరించిందో అర్థం కావడం లేదని అధికారులు తలలు పట్టుకున్నారు ఇక ఆమె జాబు ఊడిందో లేదో తెలియ రాలేదు.ప్రస్తుతానికి అయితే 10 లక్షల వ్యూస్‌తో ఈ వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
దీనిని మీరు కూడా చూసేయండి.