తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర( Medaram Mahajatara ) చివరి అంకానికి చేరుకుంది.ఇవాల జన దేవతలు వన ప్రవేశం చేయనున్నారు.
జాతరలో చివరి రోజు కావడంతో మేడారం సమ్మక్క, సారలమ్మ( Sammakka, Saralamma ) నామ స్మరణతో మారు మోగుతోంది.ఈ క్రమంలో ముందుగా సమ్మక్క ఇవాళ సాయంత్రం తిరిగి వనప్రవేశం చేస్తుంది.
అలాగే సారలమ్మ కన్నెపల్లికి వెళ్లిపోతుంది.పగిడిద్దరాజు పూనుగుండ్లకు, గోవిందరాజులు కొండాయికి ఒకే సమయంలో వెళ్లిపోనున్నారు.
ఆదివాసీ గిరిజన సంప్రదాయాల ప్రకారం వడ్డెలు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.అనంతరం తల్లులను ఎక్కడి నుంచి తోడ్కొని వస్తారో తిరిగి అక్కడికే సాగనంపుతారు.
దీంతో నాలుగు రోజులపాటు జరిగే మేడారం జాతర పూర్తి అవుతుంది.కాగా వనదేవతల దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్న సంగతి తెలిసిందే.