దేశంలోనే అతి పెద్ద డైనోసార్ పార్క్... ఎక్కడంటే?

యావత్ దేశంలోనే భారీ డైనోసర్‌ థీమ్‌ పార్క్‌ నిర్మాణానికి ఈ బుధవారం రూపకల్పన జరిగింది.అవును, సుమారు 13.72 కోట్లతో నిర్మిస్తున్న ఈ పార్కును ఎంతో ప్రతిష్టాత్మకంగా వేస్ట్‌ టు హెల్త్‌ విధానంలో నిర్మిస్తున్నారు.దేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో నిర్మిస్తున్న ఈ డైనోసర్‌ థీమ్‌ పార్క్‌కు బుధవారం గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా ఈ పార్కు నిర్మాణానికి గాను పునాది రాయి వేయడం గమనార్హం.3.5 ఎకరాల్లో ఈ పార్కు సెకండ్‌ ఫేజ్‌ నిర్మాణం తాజాగా చేపట్టారు.ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ డైనోసర్‌ థీమ్‌ పార్క్‌ను నిర్మిస్తోంది.చిన్నారులను ఆకర్షించేందుకు గాను ఈ పార్క్‌ను రూపొందిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

 The Largest Dinosaur Park In The Country... Where Dinosaur Park, Viral Latest,-TeluguStop.com
Telugu Delhi, Dinosaur Park, Latest, Park-Latest News - Telugu

ఇక ఈ పార్కులో దాదాపు 250 టన్నుల చెత్తతో 15 డైనోసర్‌ బొమ్మలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.అంతేకాకుండా పార్కులో లైటింగ్‌తో పాటు సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో పాటు ఫుడ్‌ కోర్ట్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సేకరించే చెత్తతో ఈ పార్కులో 7 ప్రపంచ వింతల నిర్మాణాలను కూడా చేపట్టనున్నారు.ఇలా ప్రపంచంలోని 7 వింతలను ఒకే చోట ఏర్పాటు చేస్తున్న తొలి పార్క్‌ ఇదేనని ఈ సందర్భంగా అధికారులు చెబుతున్నారు.“వేస్ట్ టు వండర్‌” పేరుతో ఈ పార్కును నిర్మించడం విశేషం అని చెప్పుకోవాలి.

Telugu Delhi, Dinosaur Park, Latest, Park-Latest News - Telugu

ఇకపోతే ఈ పార్కు తొలి ఫేజ్‌ను 2019 ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ ప్రారంభించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది.కాగా తాజాగా పార్కు రెండో దశను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అభివృద్ధి చేయబడుతుంది.G20 సమ్మిట్‌కు ముందు, ఇటువంటి ప్రాజెక్ట్ దేశ రాజధాని అందాన్ని మరింత పెంచుతుందని ఢిల్లీ మున్సిపల్‌ అధికారులు చాలా గర్వంగా చెబుతున్నారు.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు త్వరలో చెప్పనున్నారు అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube