Viral Video : వెళ్తున్న కారులో నుంచి జారిపడిన ల్యాప్‌టాప్.. వీడియో వైరల్..

రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలామంది పాటలు వినడానికి లేదా మ్యూజిక్ ప్లే చేయడానికి ఇష్టపడతారు.ఆ పాటలు ఎంజాయ్ చేస్తూ స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటారు.

 The Laptop Slipped From The Moving Car The Video Went Viral-TeluguStop.com

ఈ సమయంలో ఇతర విషయాలపై వారు ఫోకస్ చేయలేరు.దీనివల్ల ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

తాజాగా ఒక వ్యక్తి కూడా ఇలా మ్యూజిక్ వింటూ డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటే అనుకోని ప్రమాదం జరిగింది.ఆ వ్యక్తి నడుపుతున్న కారు కిటికీలోంచి ఒక ల్యాప్‌టాప్‌( Laptop ) కిందపడి ధ్వంసం అయ్యింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆన్‌లైన్‌లో చాలా మంది దీనిని చూసి నవ్వుకుంటున్నారు.

డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలాంటి పనులు చేసే వారికి చివరికి జరిగేది ఇదే అని కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఆ వ్యక్తి ఒక ప్రముఖ పాట వింటూ డ్రైవింగ్ చేయడం మనం చూడవచ్చు, డ్యాష్‌బోర్డ్‌పై అతని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఉండటం కూడా గమనించవచ్చు.అయితే కారు ఒక మలుపు తిరిగినప్పుడు ల్యాప్‌టాప్ డ్యాష్‌బోర్డ్‌పై నుంచి జారుతూ కిటికీలోంచి బయట పడిపోయింది.ల్యాప్‌టాప్ రోడ్డుపై చూస్తుండగానే పడిపోవడంతో డ్రైవర్ షాక్ అయ్యాడు.

వెంటనే కారు ఆపేసి ల్యాప్‌టాప్‌ని చెక్ చేయడానికి పరిగెత్తాడు.తర్వాత దాని పరిస్థితి ఎలా ఉందనేది తెలియ రాలేదు.

ఈ వీడియోను సోషల్ మీడియా( Social media )లో చాలా మంది షేర్ చేశారు.ఇది నెటిజన్లను బాగా నవ్వించింది.

ఇదంతా కేవలం దృష్టిని ఆకర్షించేందుకే ఏర్పాటు చేశారా లేక నిజంగానే ప్రమాదం జరిగిందా అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు.ఈ సంఘటనపై ఆన్‌లైన్‌లో చాలా జోకులు, వ్యాఖ్యలు వచ్చాయి.కారు కిటికీలోంచి ల్యాప్‌టాప్ పడిపోవడాన్ని సూచిస్తూ, “విండోస్ ద్వారా విండోస్ అన్‌ఇన్‌స్టాల్ చేయడం జరిగింది” అని సరదాగా ఒక వ్యక్తి చమత్కరించాడు.ఆ ల్యాప్‌టాప్ యజమానికి ఈ సంఘటనను సదరు డ్రైవర్ ఎలా చెప్పుకుంటాడో అని మరికొందరు అతడి భవిష్యత్తును ఊహించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube