'సీతారామం' వెనుక ఇంత కష్టం ఉందా.. ఆకట్టుకుంటున్న జర్నీ వీడియో!

గత జులై నెలలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అనేవే పడలేదు.వచ్చిన సినిమా వచ్చినట్టు ప్లాప్ అవుతూ వచ్చాయి.

 The Journey Of Dulquer Salmaan Sitharamam Movie Details, Dulquer Salmaan, Hanu Raghavapudi, Mrunal Thakur, Sita Ramam, Rashmika Mandanna, Ashwini Dutt-TeluguStop.com

దీంతో ఆగష్టు నెలలో రిలీజ్ అయ్యే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూసారు.మరి ఆ ఎదురు చూపులు ఫలించి మంచి సినిమాలు వచ్చాయి.

ఈ నెలలో రిలీజ్ అయినా సినిమాల్లో సీతా రామం ఒకటి.

 The Journey Of Dulquer Salmaan Sitharamam Movie Details, Dulquer Salmaan, Hanu Raghavapudi, Mrunal Thakur, Sita Ramam, Rashmika Mandanna, Ashwini Dutt-సీతారామం#8217; వెనుక ఇంత కష్టం ఉందా.. ఆకట్టుకుంటున్న జర్నీ వీడియో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా ఆగష్టు మొదటి వారంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.

హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమా సీతా రామం. యుద్ధం నేపథ్యంలో అందమైన ప్రేమ కథను మరింత ఎమోషనల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్.

ఈ సినిమా రిలీజ్ ముందు అంత అంచనాలు లేకపోయినా రిలీజ్ తర్వాత మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.దీంతో ఈ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఆగష్టు 5న రిలీజ్ అయినా ఈ సినిమా ఇండియా లోనే కాదు ఓవర్సీస్ లో కూడా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది.ఇది ఇలా ఉండగా తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి ఒక వీడియో రిలీజ్ చేసారు.

హను రాఘవపూడి ఈ సినిమా లోని ప్రతి సన్నివేశాన్ని చాలా స్వీట్ గా మనసుకు హత్తుకు విధంగా మంచు కొండల్లో చూపించారు.మరి ఈ సినిమా లొకేషన్లలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను చూపిస్తూ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.ఈ వీడియో చూసిన ప్రేక్షకులు వీరి శ్రమను అభినందిస్తుంది.

మైనస్ డిగ్రీ వాతావరణంలో కూడా యూనిట్ మొత్తం ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్టు తెలుస్తుంది.అంత కష్టం ఉరికనే పోలేదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.కాగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించారు.

రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube