పార్లమెంట్ ను కుదిపేస్తున్న భద్రతా వైఫల్యం అంశం..!

లోక్ సభలో భద్రతా వైఫల్యంపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది.

ఈ మేరకు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.

ఈ క్రమంలో లోక్ సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు.సభా నియమాలను ఉల్లంఘించిన నేపథ్యంలో పార్లమెంట్ సెషన్ ముగిసేంత వరకు సస్పెన్షన్ కొనసాగనుంది.

The Issue Of Security Failure That Is Collapsing The Parliament..!-పార్�

ఈ మేరకు సస్పెండ్ కు గురైన ఎంపీల్లో టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, ఎస్ జోతిమణి, రమ్య హరిదాస్ మరియు డీన్ కురియకోస్ ఉన్నారు.కాగా ఉభయసభలు ప్రారంభం కాగానే నిన్న జరిగిన స్మోక్ బాంబ్ ఘటనపై విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు.

ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.పలుమార్లు వాయిదా పడిన అనంతరం సభలు ప్రారంభమైనప్పటికీ ఎంపీలు ఆందోళనలు చేయడంతో వారిని సస్పెండ్ చేశారు.

Advertisement
హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!

తాజా వార్తలు