ఉపాది కూలీలు ఆకలి కేకలు:పట్టించుకోని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు

ఉపాధి హామీ భకాయిలు వెంటనే చేల్లించాలని ఉపాధి కూలీలు ఆకలి కేకలు పెడుతున్నారు దేవరాపల్లి, మండలంలోని కూలీలు శనివారం భకాయిలు చేల్లించాలని పని ప్రదేశంలో ఆకలి కేకలు పెట్టారు అనంతరం, వ్వవసాయకార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న మాట్లాడుతూ మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు అదికధరలు ప్రభావం కూలీలు పై పడిందని వంటనూనె గ్యాస్ పెట్రోల్ డిజిల్ కరంటు ఆర్టీసీ చార్జీలు పెరిగిపోవడం జిల్లాలోని ఉపాది కూలిలకు సకాలంలో బిల్లులు చేల్లించక పోవడంతో పస్తులు పడుకుంటున్నారని తెలిపారు ఉపాధి హమి చట్టాన్ని నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి నీర్వీయం చేయుడం కోసం ప్రయత్నం చేస్తున్నాయని దీనికి తగిన మూల్యం ఛేల్లించక తప్పదన్నారు జిల్లా లోని దాదాపుగా 150 కోట్లు భకాయిలు ఉన్నాయని విటిని విడుదల చేసినట్లు ప్రభుత్వం చేబుతున్న కూలీలు ఎకౌంట్సులో పడక పోవడం తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు ప్రతిపదిహేను రోజులకు ఓక్కసారి కూలిలకు భకాయిలు చేల్లించాలని చట్టంలో ఉందని ఎనిమిది వారాలు అయిన భకాయిలు చేల్లించలేని ప్రభుత్వం పై కూలీలు ఎందుకు కేసులు పెట్టకూడదని ప్రశ్నించారు వెంటనే భకాయిలు కూలీలు ఎకౌంట్సులో వెంటనే జమచేయాలని డిమాండ్ చేసారు,రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుండి మెటిరియల్ చార్జీ డబ్బులు కోసం పనిదినాలు ఎక్కవగా చూపించి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిదులు దారి మళ్ళించడం మేటిరియల్ డబ్బులు కోసం కోంత మంది కోర్టుకు వెళ్ళడం రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా నమ్మకం పోయిందని తెలిపారు దీంతో కేంద్ర ప్రభుత్వం (NiC) నేషనల్ వైడ్ సాప్ట్ వైర్ తీసువచ్చి నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంభందం లేకుండానే కూలీలు ఎకౌంట్సులో డబ్బులు పడే విధంగా ప్రయత్నం చేస్తుందని తెలిపారు దీని వలన అనేక సమస్యలు వస్తున్నాయని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్ములాటలు వలన కూలిలకు తివ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు, కేంధ్రప్రభుత్వం అయితే పూర్తిగా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీయం చేయడం కోసం పూనుకుందని అందులో బాగంగానే సాఫ్టువేరు మార్పుచేయడం రెండు పూటల పని,అని చేప్పడం మేట్లును మార్పులు చేయడం సమ్మర్ ఎలవెన్సును ఎత్తేయడం బడ్జెట్ లో నిదులు కొరత విధించడం సకాలంలో బిల్లులు చేల్లించకపోవం చేస్తుందన్నారు ఈ ఎండకి తట్టుకోలేక కూలీలు చనిపోయే ప్రమాదం ఉందన్నారు,పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేవన్నారు పోని కొలతలు లేకుండా వేతనం 257 రూపాయలు ఇస్తారా అంటే అది లేదన్నారు మార్చి నుండి జూన్ వరకు ఎండాకాలంలో నేల గట్టిగా ఉంటుందని గునపాం గడ్డపార దిగదు కాబట్టి, సమ్మర్ అలవెన్సు ఇచ్చే వారని కానీ ఇప్పటి నుండి సమ్మర్ ఎలవెన్సు రద్దు చేస్తున్నామని జీవో ఇచ్చి రద్దు చేసెసారని అన్నారు దీనివలన కూలిలే ఈపనులు మాకు వద్దంటూ పనికి దూరం అయ్యెవిదంగా చేయడం కోసం ప్రభుత్వం పూనుకుంటుందని అందుకనే ఉపాధి హామి రక్షణ కొరకు ఎప్పటికప్పుడు ఆందోళన, చేసి చట్టాన్ని రక్షించుకోవాలని కోరారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ నెంబర్.17000 (31)ను రద్దు చేయాలి.ఉపాధి హామీ లో రెండు పూటల పని రద్దు చేయాలి.సమ్మర్ అలవెన్స్ కొనసాగించాలి 30 రోజులు పని చేసిన ప్రతి కుటుంబానికి పనిముట్లు టెంటు ఇవ్వాలి.

 The Hunger Cries Of The Employed Workers: The Indifferent Central And State Gove-TeluguStop.com

బకాయి వేతనాలు ఇచ్చేటప్పుడు వడ్డీతో కలిపి ఇవ్వాలి ఉపాధి హామీ కి 2 లక్షల కోట్లు నిధులు కేటాయించాలని వెంటనే భకాయిలు చేల్లించాలని కూలీలు డిమాండ్ చేసారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube