తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది.ఈ మేరకు ఢిల్లీలో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి సమావేశం కానుంది.
అభ్యర్థుల వడపోతపై ఇవాళ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.ఇప్పటికే 55 మందితో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.
సుమారు పది నుంచి పదిహేను నియోజకవర్గాల్లో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో రెండో విడత జాబితాలో భాగంగా 30 నుంచి 40 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
అలాగే మిగతా అభ్యర్థులను ఈ నెలాఖరున ప్రకటించే అవకాశం ఉంది.మరోవైపు కమ్యూనిస్టులకు చెరో రెండు స్థానాలు ఇవ్వాలని చూస్తున్న కాంగ్రెస్ కామ్రేడ్స్ తో పొత్తు విషయంపై కూడా ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.