గుడ్ న్యూస్: ఆగస్టు 3న కరోనా మందు విడుదల..!

ప్రపంచాన్ని మొత్తం కరోనా విలయతాండవం చేస్తుంది.ఈ మహమ్మారి బారిన పడి చాల మంది వారి ప్రాణాలను పోగోట్టుకున్నారు.

ఇంకా ఈ కరోనా బారినపడి కొన్ని లక్షల మంది చికిత్స పొందుతున్నారు.అయితే ఈ మహమ్మారి ఆగడాలకు రష్యా చెక్ పెట్టడానికి ఒక్క టీకాను కనుగొన్నది.

ఆ వ్యాక్సిన్ ను ఆగస్టు మూడో తేదీన విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు రష్యా హెల్త్ మినిస్టర్ ప్రకటన జారీ చేశారు.దీనికి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

అయితే ఆగస్టు 3 నుంచి రష్యా, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌ లో టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ను వేలాది మందిపై నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.సమాంతరంగా టీకాను కూడా ప్రజలకు అందుబాటు లోకి తెస్తామని చెప్పారు.

Advertisement

సెచెనోవ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈ కరోనా టీకాపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రధానంగా దృష్టి పెట్టారు.ఇప్పటికే తొలి రెండు దశల క్లినియల్‌ ట్రయల్స్‌ విజయ వంతంగా పూర్తైనట్లు రష్యా హెల్త్ మినిస్టర్ తెలిపారు.

తొలి వ్యాక్సిన్​ అన్ని సక్రమంగా జరిగినట్లయితే ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకాగా రష్యా వ్యాక్సిన్‌ నిలవనుంది.ఈ ఏడాది దేశీయంగా 3 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా ప్రకటించింది.

మరో 17 కోట్ల డోస్‌లు విదేశాల్లో తయారవుతాయని తెలిపింది.వ్యాక్సిన్‌ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపినట్లు రష్యా వెల్లడించింది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు