సోషల్ మీడియాలో, మీరు బైక్‌పై స్టంట్స్(Bike Stunts) చేసే వ్యక్తుల వీడియోలను చూస్తారు.కొన్ని వీడియోలు సరదాగా ఉంటాయి.
కొన్ని చాలా అద్భుతంగా అనిపిస్తాయి.ఏదేమైనా ఇలాంటి ఫీట్లు చాలా ప్రమాదకరం.
వీటిని చూస్తున్న వారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.అయితే చాలా మందిని అలరించడం కోసం కొందరు స్టంట్లు చేసి ప్రాణాల మీదకు కొని తెచ్చుకుంటారు.
చాలా వీడియోలలో మనం చూసే స్టంట్స్ చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి.చాలా మంది స్టంట్స్ చేస్తూ ప్రాణాలు పోయిన వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి.
అయితే ఎక్కువగా ఇలాంటి బైక్ స్టంట్లు కేవలం అబ్బాయిలు మాత్రమే చేస్తుంటారు.వారిని అనుసరిస్తూ ఇద్దరు అమ్మాయిలు బైక్ స్టంట్లు చేశారు.
తర్వాత ఏమైందో తెలుసుకుందాం.

బాలికలు(girls) స్టంట్స్ చేసే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో, ఇద్దరు బాలికలు బైక్ నడుపుతున్నారు.వారిలో ఒకరు బైక్ రైడింగ్ చేస్తుండగా, మరో అమ్మాయి బైక్ వెనుక భాగంలో కూర్చుతంది.
బైక్ నడుపుతున్న అమ్మాయి స్టంట్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది.ముందు చక్రాన్ని గాలిలోకి లేపాలని అనుకుంటుంది.
కానీ ఆమె ప్రయత్నం బెడిసికొడుతుంది.బైక్ ముందు చక్రం గాలిలోకి లేపగానే వారిద్దరూ అదుపు తప్పి కింద పడిపోతారు.
అయితే బైక్ నడుపుతున్న అమ్మాయి అప్రమత్తమై హ్యాండిల్ గట్టిగా పట్టుకుంటుంది.తర్వాత దానిని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది.
ఇక బైక్ స్టంట్ చేసి పడిపోయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు నవ్వుకున్నారు.ఈ స్టంట్ వీడియో ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు కామెంట్ల విభాగంలో మీమ్స్ పంపుతున్నారు.








