కాంగ్రెస్ విజయభేరీ తొలి విడత బస్సు యాత్ర ప్రారంభం

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన కొనసాగుతోంది.

ఈ క్రమంలో హైదరాబాద్ కు చేరుకున్న నేతలు రామప్ప దేవాలయానికి వెళ్లారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.తరువాత రామప్ప ఆలయం వద్ద కాంగ్రెస్ విజయభేరీ తొలి విడత బస్సు యాత్రను రాహుల్, ప్రియాంక ప్రారంభించారు.

బస్సు యాత్రతో పాటుగా ములుగు బహిరంగ సభా స్థలికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా బయలుదేరారు.కాసేపట్లో బహిరంగ సభా వేదికపై నుంచి రాహుల్ తో కలిసి ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు.

తరువాత ప్రియాంక గాంధీ ఢిల్లీకి వెళ్లనుండగా బస్సు యాత్ర భూపాలపల్లికి చేరనుంది.అక్కడ నిరుద్యోగ యువతతో కలిసి రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహించనున్నారు.

Advertisement

కాగా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విజయభేరీ తొలి విడత బస్సు యాత్ర మూడు రోజులపాటు కొనసాగనుంది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు