దేశంలోనే తొలి మెగ్నీషియం సైకిల్.. ధర, ఫీచర్స్ ఇవే..!

టాటా ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ స్ట్రైడర్ సైకిల్స్( Stryder Cycles ) భారత మార్కెట్లోకి కాంటినో శ్రేణి సైకిళ్లను విడుదల చేసింది.ఈ సైకిల్ భారతదేశపు మొట్టమొదటి మెగ్నీషియం ఫ్రేమ్ సైకిల్ అని కంపెనీ తెలిపింది.ఈ కాంటినో గెలాక్టిక్ 27.5T సైకిల్ భారతదేశంలో ఉన్న అన్ని స్ట్రైడర్ సైకిల్స్ రిటైల్ స్టోర్ లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.ఒకవేళ ఆన్లైన్ లో కొనుగోలు చేయాలనుకుంటే కంపెనీ వెబ్సైట్ తో పాటు ఈ కామర్స్ ఫ్లాట్ ఫారం అమెజాన్ ( Amazon )లో అందుబాటులో ఉంటుంది.ఈ కాంటినో గెలాక్టిక్ 27.5T సైకిల్ ధర రూ.27896 గా ఉంది.ఈ సైకిల్ గ్రే, మిలిటరీ గ్రీన్ అనే రంగులలో అందుబాటులో ఉంటుంది.

 The First Magnesium Bicycle In The Country The Price And Features Are These, Ma-TeluguStop.com

ఈ కాంటినో గెలాక్టిక్ 27.5T సైకిల్ ఫీచర్ల విషయానికి వస్తే.ఈ సైకిల్ డ్యూయల్ డిస్క్ బ్రేకులు, స్మూత్ గేర్ షిఫ్టింగ్ కోసం ఫ్రంట్, రియర్ డెరైలర్లు, లాక్-ఇన్/ లాక్-అవుట్ టెక్నాలజీతో ఫ్రంట్ సస్పెన్షన్ ఫోర్క్ తో వస్తుంది.

ఈ సైకిల్ గరిష్ట వేగం 21kmph.

ఈ సైకిల్ కు ఉండే ఫ్రేమ్ లు మెగ్నీషియం ఫ్రేమ్( Magnesium frame ) లు సాంప్రదాయ అల్యూమినియం ఫ్రేమ్ల కంటే.మెగ్నీషియం ఫ్రేమ్ తేలికగా, బలంగా ఉంటుంది.ఇవి ఆఫ్- రోడింగ్ కు అనువైనవిగా పరిగణిస్తుంటారు.

అంతేకాకుండా ఇది కంపనాలను ఎక్కువగా గ్రహిస్తుంది.కాబట్టి ఈ సైకిల్ రైడింగ్ కు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

రైడింగ్ సౌకర్యవంతంగా ఉండడం కోసం ఈ సైకిల్ ను ప్రత్యేకంగా తయారు చేసినట్లు స్ట్రైడర్ సైకిల్స్ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube