కృష్ణాష్టమి సందర్భంగా సెలవు కావడంతో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి.అందులో ఒకటి టాలీవుడ్ మూవీ కాగా రెండవది బాలీవుడ్ మూవీ.
ఈ రెండు కూడా పాజిటివ్ బజ్ తెచ్చుకోవడం విశేషం.అందులో ఒకటి ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’( Miss Shetty Mr Polishetty ).ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ( Anushka Shetty ) స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది అనే చెప్పాలి.నిశ్శబ్దం సినిమా తర్వాత అనుష్క మరో సినిమాతో రాలేదు.
అందుకే ఈమె ఫ్యాన్స్ అంతా తన కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఇదే తరుణంలో ఎట్టకేలకు ఒక కొత్త సినిమా ఒప్పుకుని ఫినిష్ చేసింది.
ఆ సినిమానే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.ఇది సెప్టెంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
అనుష్క హీరోయిన్ గా నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో మొదటి రోజు నుండే అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టి అదరగొడుతుంది.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి.మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చిన జవాన్ వంటి సినిమా ఉండడంతో అంతగా ఓపెనింగ్స్ రాలేదు.

అయితే స్లోగా స్లో పాయిజన్ లా ఆడియెన్స్ కు ఈ సినిమా ఎక్కడంతో రోజులు గడిచే కొద్దీ పుంజుకుంటుంది.మొదటి మూడు రోజుల కంటే 4వ రోజు ఆదివారం అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.రారా కృష్ణయ్య సినిమాతో డైరెక్టర్ గా మారిన మహేష్ ( Mahesh Babu P )ఈ సినిమా కథను బాగా ప్రెజెంట్ చేయడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరిస్తుంది.4వ రోజు ఏకంగా 2.44 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టి ఆశ్చర్య పరుస్తుంది.ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఫినిష్ చేసినట్టు తెలుస్తుంది.13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 13.20 కోట్ల షేర్ సాధించి టార్గెట్ అయితే ఫినిష్ చేసింది.ఇక ఈ రోజు నుండి వచ్చే వసూళ్లు అన్ని లాభాలు అనే చెప్పాలి.మొత్తానికి జవాన్ వంటి సినిమా ఉన్న ఈ సినిమాకు మంచి స్పందనే లభిస్తూ దూసుకు పోతుంది.







