వెర్సటైల్ హీరో సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా ‘కృష్ణమ్మ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న వర్సటైల్ హీరో సత్యదేవ్ పుట్టినరోజు (జూలై 4) సందర్భంగా కొత్త సినిమా కృష్ణమ్మ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 The First Look Poster Of 'krishnamma' Was Released On The Occasion Of Versatile-TeluguStop.com

అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద.కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీ వీ గోపాల కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆదివారం నాడు చిత్రం యూనిట్ విడుదల చేసింది.

ఇక ఇందులో సత్యదేవ్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు.పోస్టర్‌లో ఆ కత్తి పట్టుకుని స‌త్య‌దేవ్ నిలుచుకున్నారు.మంచి, చెడుల కలయిక నది నడత… పగ, ప్రేమ కలయిక మనిషి నడక అనే ఓ భావం ఎలివేట్ అవుతుంది.

కృష్ణమ్మ అనే టైటిల్ కూడా ఎంతో పవర్ ఫుల్‌గా అనిపిస్తోంది.

ఇక ఈ యాక్షన్ మూవీకి సన్నీ కూరపాటి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.కాళ భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.

తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రంలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

నటీనటులు : సత్యదేవ్, లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం తదితరులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube