తెలంగాణలో తొలి త్రీడి ప్రింటెడ్ దేవాలయం.. దీని విశేషాలు ఏమిటంటే..?

ప్రపంచంలోనే తొలి ప్రింటెడ్ దేవాలయం( Printed temple ) తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది.భవన నిర్మాణ రంగంలో రోబోటిక్ మిషన్ రావడంతో నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి.

 The First 3d Printed Temple In Telangana What Are Its Features , Telangana, 3d-TeluguStop.com

సాధారణంగా సామాగ్రి తో పాటు కూలీలు అందుబాటులో ఉన్నా కూడా నిర్మాణం పూర్తవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది.కానీ గంటల వ్యవధిలోనే నిర్మాణాలను పూర్తిచేసే టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి సమీపంలో త్రీడీ ప్రింటెడ్ టెక్నాలజీతో మూడు దేవాలయాలను నిర్మించనున్నారు.ఈ దేవాలయాలు నిర్మించే బాధ్యతలు అప్సూజ కంపెనీ తీసుకుని సింప్లీ పోర్జ్ అనే త్రీడి ప్రింటెడ్ టెక్నాలజీకి చెందిన కంపెనీకి నిర్మాణ కాంట్రాక్ట్ అప్పగించింది.

Telugu Temple, Latest Telugu, Siddipeturban, Telangana-Technology Telugu

ఈ దేవాలయాల నిర్మాణంలో భాగంగా 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తుతో ముందుగా వినాయక ఆలయం, తరువాత శివాలయం, తర్వాత అమ్మవారి ఆలయం నిర్మాణం జరగనుంది.ఈ మూడు దేవాలయాలను పక్కపక్కనే.మనుషులు తయారు చేయలేని డిజైన్ ను కంప్యూటర్ లో పొందుపరిచి, ఆ డిజైన్ ను కాంక్రీట్ త్రీడి ప్రింటెడ్ మిషన్( 3D printed mission ) ద్వారా నిర్మించనున్నారు.ఈ త్రీడి ప్రింటెడ్ ద్వారా దేవాలయాన్ని నిర్మిస్తే.

తక్కువ మ్యాన్ పవర్, తక్కువ సమయం తో పాటు అత్యంత టెక్నాలజీతో కూడిన కంప్యూటర్ డిజైనింగ్ నిర్మాణం రూపొందించబడుతుందని ఇంజనీర్లు తెలిపారు.

Telugu Temple, Latest Telugu, Siddipeturban, Telangana-Technology Telugu

ఈ దేవాలయాల నిర్మాణాలకు ఉపయోగిస్తున్న త్రీడి ప్రింటెడ్ టెక్నాలజీ మిషన్ ను యూరోపియన్ నుండి తీసుకురావడం జరిగింది.అయితే ఇందులో ఉండే ఇంటర్నల్ సిస్టం, సాఫ్ట్వేర్ మొత్తాన్ని భారతదేశంలోనే తయారు చేశారు.ఈ త్రీడి ప్రింటింగ్ ద్వారా రకరకాల డిజైన్లను నిర్మించవచ్చు.

కేవలం మనకు కావలసిన డిజైన్ ను మిషన్ లో ఫిక్స్ చేస్తే చాలు నిర్మాణం అదే చేసేస్తుంది.కేవలం ముగ్గురు మనుషుల సహాయంతోనే నిర్మాణం పూర్తవుతుంది.గత సంవత్సరంలోనే సిద్దిపేటలో ఈ త్రీడీ ప్రింటెడ్ దేవాలయాలను నిర్మించేందుకు పునాది వేశారు.అయితే ఇందుకు కావలసిన మెటీరియల్స్ మొత్తం ఏర్పాటు చేసుకున్నాక ప్రస్తుతం నిర్మాణ పనులు మొదలయ్యాయి.

ఈ టెక్నాలజీ ఉపయోగించి విపత్తు వచ్చినప్పుడు త్వరగా ఇళ్లను నిర్మించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube