కబ్జ మోషన్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం..!

కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా పేరు పొందిన ఉపేంద్ర తెలుగులో ఏ, రక్త కన్నీరు, ఉపేంద్ర, బుద్ధిమంతుడు లాంటి విభిన్న రకమైన చిత్రాలతో నటించి అలరించాడు.

అంత వరకు హీరోగా నటించిన ఆయన ఇదివరకు కాలంలో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో అల్లు అర్జున్ కు పోటీపడి మరి విలన్ పాత్రలో నటించాడు.

అంతేకాదు ఈ మధ్య కాలంలో ఏవైనా మంచి పాత్రలు వస్తే ఏ హీరో అయినా సరే చేయడానికి సిద్ధం అంటూ ఓపెన్ ఆఫర్ చేశాడు ఉపేంద్ర. ఆల్ ఇండియా వైడ్ సూపర్ హిట్ విజయం సాధించిన కే జి ఎఫ్ సినిమా కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి ఏ చిత్రం వచ్చిన ఇప్పుడు అందరూ ఇంట్రెస్టింగ్గా గమనిస్తున్నారు.తాజాగా ఉపేంద్ర నటిస్తున్న సినిమా పేరు కబ్జ.

ఈ చిత్రంపై భారీ అంచనాలు కన్నడ ఇండస్ట్రీ వైపు నుండి వస్తున్నాయి.శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్ పతాకంపై లాంకో శ్రీధర్ సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.

హీరో ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభిస్తోంది.

Advertisement

ఈ మోషన్ పోస్టర్ లో ఓ సీరియస్ లుక్ లో ఉపేంద్ర కనబడుతున్నాడు.తాను వెళ్తున్న బండి మీద ఓ రౌడీని చితకబాది తీసుక వెళుతున్నాడు.

ఈ పోస్టర్ కు సంబంధించి మ్యూజిక్ కూడా అదిరిపోయింది.

ఈ సినిమాకి కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన చంద్రు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.అలాగే కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ విజయం సాధించిన కేజీఎఫ్ సినిమాకి సంగీత దర్శకుడు అయిన రవి బస్సుర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠీ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు