సినిమా ఇండస్ట్రీలో కొందరి దర్శకులకు హీరోలకు మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంటుంది.అలాంటి బాండింగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నటుడు పవన్ కళ్యాణ్ మధ్య ఉందని చెప్పాలి.
ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉండడంతో పవన్ కళ్యాణ్ సినిమాలలో త్రివిక్రమ్ ప్రమేయం ఉంటుంది.ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలోనే కాకుండా ఈయన రాజకీయాలలోకి వచ్చిన మొదట్లో తన స్పీచ్ ల విషయంలో కూడా త్రివిక్రమ్ తనకు సహాయం చేశారని తెలుస్తుంది.

ఇలా త్రివిక్రమ్ పవన్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పాలి అయితే తాజాగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ త్రివిక్రమ్ తో ఉన్నటువంటి పరిచయం గురించి ప్రశ్నించారు.అయితే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తో తనకు ఉన్న స్నేహం గురించి మాత్రమే కాకుండా తనతో ఉన్న గొడవ గురించి కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు.
తాను త్రివిక్రమ్ తో స్నేహం చేయాలని అనుకోలేదు కానీ ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని తెలిపారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు అతడు సినిమా కథ చెబుతున్న సమయంలో తాను నిద్రపోయానని చెప్పాడు కానీ అప్పటికి నేను మెలకువలోనే ఉన్నానని చెప్పాను.ఈ విధంగా ఈ విషయం గురించి మా ఇద్దరి మధ్య ఆరోజు తలెత్తిన గొడవ ఇప్పటికీ తేలలేదని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తనకు ఉన్నటువంటి గొడవ గురించి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు.ఇక త్రివిక్రమ్ తాను ఎప్పుడు కలిసిన సినిమాల గురించి పురాణాల గురించి ప్రస్తావిస్తూ ఉంటామని త్రివిక్రమ్ తనకు ఎప్పటికీ ఒక గురువేనని పవన్ ఈ సందర్భంగా తెలిపారు.