కొన్ని కొన్ని సార్లు ఫ్యాన్స్ చేసే అతి పట్ల హీరోల కెరీర్ ఏమవుతుందో కూడా అర్థం కాదు.అవును కొన్నిసార్లు ఫ్యాన్స్ వల్ల కూడా హీరోలకు ముప్పులు తప్పవు.
ఎంత అభిమాని హీరో అయిన కూడా అభిమానులు చూపించాల్సిన అభిమానం లిమిట్ గానే ఉండాలి.అంతేకానీ అంతకుమించి ఉంటే ఇక అంతే సంగతి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అభిమానుల తీరు అలాగే ఉందని తెలుస్తుంది.వాళ్ళ ప్రవర్తన వల్ల ఆయనతో ఏ హీరోయిన్ కూడా నటించడానికి ముందుకు రావట్లేదని అర్థమవుతుంది.
మరి ఆ ఫ్యాన్స్ ప్రవర్తన ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో పవర్ స్టార్ గా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువే.
నిజానికి తెలుగు ప్రేక్షకులకు ఆయన పుట్టు పూర్వత్తరాలు మొత్తం తెలుసు.చిరంజీవి( Chiranjeevi ) సపోర్టుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు.
కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు.

అసలు ఈయనకు ఏ స్టార్ హీరోకు లేనంత అభిమానం ఉందంటే మామూలు విషయం కాదని చెప్పాలి.చాలామంది అభిమానులు ఈయనను ఒక దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు.ఈయన గురించి ఏదైనా వార్త వస్తే చాలు బాగా హల్చల్ చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా పవన్ ను సొంతవాళ్ళు ఏమైనా అన్నా కూడా అస్సలు తట్టుకోలేరు ఫ్యాన్స్.

ఇక దానికి తోడు పవన్ కళ్యాణ్ రాజకీయంలో కూడా అడుగు పెట్టగా.ఆయన అభిమానం మరింత ఎక్కువగా పెరిగిపోయింది.ఒక గొప్ప హీరోగా చూడాలనుకున్న కోరిక తీరగా.
గొప్ప రాజకీయ నాయకుడిగా చూడాలన్న కోరిక కూడా అభిమానులలో ఎక్కువగా ఉంది.ఇక పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు రాజకీయాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు.

ఒకవైపు వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి.మరోవైపు ఎన్నికలు ముందుకు వస్తున్నాయి.దీంతో రెండు వైపులా సరి సమానంగా బాధ్యతలు మోస్తున్నాడు.అయితే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తో నటించాలన్న కోరిక చాలామంది హీరోయిన్స్ కి ఉండేది.కానీ ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా వద్దనుకుంటున్నారు ఆ హీరోయిన్స్.దానికి కారణం ఎవరో కాదు పవన్ కళ్యాణ్ అభిమానులే.

అసలు విషయానికి వస్తే.మామూలుగా హీరోయిన్ పాత్ర చేయాలి అంటే హీరోలతో రొమాంటిక్ సీన్స్ చేయడం, కాస్త రాసుకొని పూసుకొని తిరగడం లాంటివి ఉంటాయి.దీంతో కొన్ని కొన్ని సార్లు ఆ రొమాన్స్ అనేది కాస్త ఎక్కువైతే చాలు హీరోల అభిమానులు సహించరు.అంతేకాకుండా బాగా ట్రోల్ చేయటం కూడా మొదలుపెడతారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరుగుతుంది.ఆయనతో కాస్త హద్దుమీరి నటిస్తే.
ఎక్కడ ఆయన ఫ్యాన్స్ తమపై టార్గెట్ చేసి ట్రోల్ చేస్తారోనన్న భయంతో ఆయనతో అవకాశాలు వచ్చినా కూడా వదులుకుంటున్నారని తెలిసింది.దీంతో డైరెక్టర్లు కూడా పవన్ కళ్యాణ్ ను తన అభిమానులకు ఇటువంటివి చేయవద్దని చెప్పమని సలహాలు ఇస్తున్న కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు అని తెలుస్తుంది.