పసి పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్న కుక్క... వీడియో చూస్తే ఫిదా..!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆనిమల్ వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా కుక్కలకు సంబంధించిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఫిదా చేస్తుంటాయి.

తాజాగా ఒక కుక్క వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక కుక్క చీకటి రూమ్స్ లో తిరగడం చూడవచ్చు.

ఇది ఆహారం కోసం వెతుకులాడుతుందని అనుకుంటే పొరపాటే.ఇది ముగ్గురు చిన్న పిల్లల ఆలనాపాలనా చూసేందుకు రాత్రిపూట నిద్ర పోకుండా కాపలా కాస్తోంది.

పిల్లలు మంచిగా ఉన్నారా లేదా అని తన భాషలో పలకరించి మరీ తన గొప్ప హృదయాన్ని చాటుకుంటోంది.సాధారణంగా కుక్కలు తమ యజమానులకు బాగా దగ్గరవుతాయి.

Advertisement

తమ యజమానుల పిల్లలను తమ పిల్లలుగా భావించి వారిని కంటికి రెప్పలా కాపాడుతాయి.అయితే ఈ కుక్క అంతకన్నా ఎక్కువ సేవలను చేస్తోంది.

యజమానుల పై భారం పడకుండా అదే వారి పిల్లలను చూసుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది.ఈ వీడియోని పూబిటీ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

ఈ వీడియోకి ఇప్పటికే లక్షలాది వ్యూస్, వేలాది లైకులు వచ్చాయి.ఈ వీడియో చూసిన యానిమల్స్ లవర్స్ ఫిదా అవుతున్నారు.

మరికొందరు మాత్రం ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.ఆడుకోడానికి రమ్మని ఈ కుక్క పిలుస్తుంది ఏమో అని ఒకసారి సరదాగా కామెంట్ చేశాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ప్రేమ కురిపించడం లో కుక్కలు మనుషుల కంటే గొప్పది అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు.ఈ హార్ట్ టచింగ్ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Advertisement

తాజా వార్తలు