జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లలో పని చేసే వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు.ఎండనక, వాననక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.
ఏదైనా డెలివరీ చేయడానికి వెళ్లినప్పుడు కొందరు కస్టమర్ల నుంచి చీత్కారాలు ఎదురవుతాయి.కొంత మంది అయితే ఏకంగా చేయిచేసుకుంటారు.
తాజాగా ఇలాగే ఓ జొమాటో కస్టమర్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి.ఓ కుక్క అతడిపై దాడి చేసింది.
చెప్పుకోలేని చోట గట్టిగా కరవడంతో ఆ జొమాటో డెలివరీ బాయ్ బెంబేలెత్తిపోయాడు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నరేంద్ర పెరియార్ అనే వ్యక్తి జొమాటో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు.శనివారం సాయంత్రం పన్వెల్‌లోని ఇండియాబుల్స్ గ్రీన్స్ మేరిగోల్డ్ సిహెచ్ఎస్లో లిఫ్ట్‌లో జర్మన్ షెపర్డ్ పెంపుడు కుక్క అతడిపై దాడి చేసింది.
అతను ప్రస్తుతం నెరుల్లోని డివై పాటిల్ మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ హాస్పిటల్ ఖర్చు కుక్క యజమాని భరిస్తున్నాడు.దీనిపై బాధితుడు పెరియార్ మాట్లాడుతూ, “డెలివరీ చేసిన తర్వాత, నేను క్రిందికి వచ్చినప్పుడు, నాకు పెద్ద కుక్క కనిపించింది.ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే కుక్క నాపై దాడి చేసింది.
నేను ఎలాగోలా నన్ను విడిపించుకుని, నొప్పితో మెలికలు తిరుగుతూ పార్కింగ్ ఏరియా వైపు పరిగెత్తాను.నేను సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిన తర్వాత నాకు భారీగా రక్తం కారుతుందని గ్రహించాను.
కొంతమంది నన్ను కమోతేలోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ వైద్యులు గాయాలకు కుట్లు వేసి, డిశ్చార్జ్ అయ్యే ముందు నాకు యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు.అయితే నా మూత్రంలో కూడా రక్తం వచ్చింది.కాబట్టి, నేను వచ్చి డివై పాటిల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాను” అని చెప్పాడు.ఇక వైద్యులు కూడా అతడికి తగిలిన గాయం చూసి అవాక్కయ్యారు.ఇక ఈ సంఘటన తనకు మచ్చగా మిగిలిపోయిందని బాధితుడు చెప్పాడు.
ఇప్పుడు కుక్కలంటే తనకు చచ్చేంత భయం ఏర్పడ్డట్టు పేర్కొన్నాడు.







