బుల్లి తెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ ఏకంగా బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్నారు.ఇలా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసిన సుధీర్ ప్రస్తుతం వెండి తెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ సినిమా ద్వారా ఆగస్టు 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుధీర్ వేదిక పైకి రాగానే పెద్ద ఎత్తున అభిమానులు కేకలు వేస్తూ సందడి చేశారు.
ఈ విధంగా ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా సుదీర్ అభిమానులు చేస్తున్న రచ్చ చూసి అక్కడున్న వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు.సుధీర్ ఏకంగా ఒక స్టార్ హీరోకి ఉండాల్సిన ఇమేజ్ సొంతం చేసుకున్నారంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇక ఈ వేదికపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతున్న సమయంలో సుధీర్ అభిమానులు పెద్ద ఎత్తున ఈలలు కేకలు వేస్తూ గోల చేశారు.అప్పటికి వారందరిని సైలెంట్ గా ఉండమని సూచించారు.ఇలా పలుమార్లు అభిమానులను సైలెంట్ గా ఉండాలని కోరినప్పటికీ సుధీర్ ఫాన్స్ మాత్రం యధావిధిగా సందడి చేయడంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏం పిచ్చిపిచ్చిగా ఉందా? అసలు మిమ్మల్ని అందరిని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు.చిన్న పెద్ద అని తేడా లేదా? గమ్మున ఉండకపోతే అందరిని బయటకు పంపించేస్తా అంటూ పెద్ద ఎత్తున రాఘవేంద్రరావు సుధీర్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.