షూ చోరీ చేసిన డెలివరీ బాయ్.. మరోసారి అర్ధరాత్రి వచ్చి ఏం చేశాడంటే

ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఏం కావాలన్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటున్నాం.ఈ డోర్‌స్టెప్ డెలివరీ నేటి బిజీ లైఫ్‌ని చాలా సులభతరం చేసిందనడంలో సందేహం లేదు.ఫుడ్, గృహోపకరణాలు, దుస్తులు ఇలా ఏవైనా కావొచ్చు.ఆర్డర్ పెట్టగానే ఇంటికే వస్తున్నాయి.మనం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.మన జీవితాలను సులభతరం చేసే ఈ సౌకర్యం మన భద్రతకు ఎంత హానికరమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది.

 The Delivery Boy Who Stole The Shoes What Did He Do Once Again In The Middle Of-TeluguStop.com

వైరల్ వీడియోలో, డెలివరీ బాయ్ కస్టమర్ డోర్ వద్ద ఉన్న షూలు దొంగిలించడం కనిపిస్తుంది.అనంతరం వెళ్లిపోయిన ఆ డెలివరీ బాయ్ మరోసారి రాత్రి 10 గంటలకు వచ్చాడు.పదే పదే డోర్ బెల్ మోగించాడు.

దీంతో ఆ మహిళా కస్టమర్ బాగా భయపడింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో కెప్టెన్ మోనికా ఖన్నా( Captain Monika Khanna ) పోస్ట్ చేసిన ఓ సీసీ టీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.అందులో డెలివరీ బాయ్ అపార్ట్‌మెంట్ డోర్ నుండి షూలను ఎలా దొంగిలిస్తున్నాడో చూడవచ్చు.

డెలివరీ బాయ్ రాత్రి 8 గంటలకు ముందు తలుపు వద్దకు వచ్చాడు.

అతను ఆర్డర్ డెలివరీ ఇచ్చాడు.ఆపై లిఫ్ట్‌లో వెళుతున్నట్లు కనిపించాడు.కాని కొన్ని సెకన్ల తర్వాత అతను తిరిగి వచ్చి, ఇంటి బయట ఉంచిన షూలను తీసుకున్నాడు.

వాటిని తన జాకెట్‌లో దాచిపెట్టి నడవడం ప్రారంభించాడు.ఈ డెలివరీ బాయ్ దోపిడీ ఇక్కడితో ఆగలేదు.

డెలివరీ బాయ్ రాత్రి 10 గంటలకు తిరిగి వచ్చి పదే పదే డోర్ బెల్ మోగిస్తూనే ఉన్నాడు.దీంతో ఆ మహిళ చాలా భయపడింది.

దీనిపై వెంటనే కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసింది.మరో సారి ఇలాంటి ఘటన జరగదని వారు హామీనిచ్చారు.

ఇలాంటి సంఘటనలు హైపర్ లోకల్ డెలివరీ ప్రమాదాలను ఎత్తిచూపుతున్నాయని ఆ మహిళ వాపోయింది.తాను ఎక్కడ ఉన్నానో ఆ డెలివరీ బాయ్‌కు తెలుసని, మరోసారి దాడి చేసే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube