కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది.షర్మిల ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు.
కాగా పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.అదేవిధంగా దాదాపు మూడు నెలలుగా షర్మిల పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇవాళ్టి వరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో షర్మిల ఏం నిర్ణయం తీసుకోనున్నారనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ ఆసక్తిగా మారింది.







