భారత్ వేదికగా ఇటీవలే జరిగిన వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) టోర్నీ టైటిల్ తృటిలో భారత్ చేజార్చుకున్న విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం భారత్ వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ 2024 కప్ కొట్టాలనే గట్టి పట్టుదలతో ఉంది.
టీమిండియా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది.సొంత గడ్డపై జరిగిన టీ20 సిరీస్( T20 series ) లో ఆస్ట్రేలియాపై భారత్ పై చేయి సాధించిన విషయం తెలిసిందే.
ఇక భారత జట్టు, సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్ల సిరీస్ అడబోతుంది.ఈ సిరీస్ లలో అద్భుత ఆటను ప్రదర్శించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించే ఆటగాళ్లకు 2024లో టీ20 ప్రపంచ కప్ ఆడే జట్టులో అవకాశం దక్కనుంది.

టీ20 ప్రపంచ కప్ ఆడే జట్టుకు రోహిత్ శర్మ( Rohit Sharma ) అనే సారథ్యం వహించనున్నాడు.ఇతనితో పాటు సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, బుమ్రా జట్టులో ఉండనున్నారు.ఇక రోహిత్ శర్మతో ఓపెనర్ గా బరిలోకి దిగేందుకు ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు.శుబ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లలో ఎవరికో ఒకరికి రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసే అవకాశం దక్కుతుంది.

ఇక జట్టులో మూడవ స్థానంలో ఇషాన్ కిషన్ ( Ishan Kishan )ఉండే అవకాశం ఉంది.శ్రేయస్ అయ్యర్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి అతనికి కూడా అవకాశం దక్కవచ్చు.ఇతనికి బ్యాకప్ గా తిలక్ వర్మ కూడా ఉన్నాడు.ఫినిషర్ గా రింకూ సింగ్ ని తీసుకునే అవకాశం ఉంది.వికెట్ కీపర్ విషయానికి వస్తే.కేఎల్ రాహుల్, జీతేష్ శర్మ లలో ఎవరికో ఒకరికి అవకాశం దక్కుతుంది.
బౌలర్ల విషయానికి వస్తే.కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయి, ఆర్షదీప్ సింగ్ అద్భుత ఆటనే ప్రదర్శిస్తున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో ఎవరు తమ సత్తా చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తారు వారికే జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.