విశాఖ సాగరతీర ప్రాంతంపరిశుభ్రంగా ఉండాలని పార్లే ఫర్ ఓసన్ సంస్థ తో ఎంఓ యు ప్రభుత్వం కుదుర్చుకోనుందని ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సముద్రంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థలను తొలగించండం పై ఎం ఓ యు జరగనుందని పేర్కొన్నారు.
ప్రపంచ పటంలో 28 కిలోమీటర్ల దారి పొడవున సముద్రం ఉన్న ఏకైక నగరం.సుందర విశాఖ నగరం అని ఆయన అన్నారు అయితే ఈనెల 26 తేదీన విశాఖలో సీఎం పర్యటిస్తు నట్లు తెలిపారు.
సీఎం పర్యటన విజయవంతంపై పార్టీ నాయకులతో చర్చించినట్లు వైవి సుబ్బారెడ్డి తెలిపారు .మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన 7200 మందికి సర్టిఫికెట్లను సీఎం చేతుల మీదగా అందించనున్నరని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి,వంశీకృష్ణ శ్రీనివాస్ , శాసనసభ్యులు అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి , సమన్వయ కర్తలు కె.కె రాజు, అకరమాని విజయ నిర్మల ,యాదవ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్, జిల్లా పరిషత్ చైర్మెన్ సుభద్ర పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.







